ఖమ్మం

శ్రీమృత్యుంజయస్వామి సన్నిధికి పోటెత్తిన భక్త జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి. 13: హర హర మహదేవ శంభో శంకర అంటూ మంగళవారం తెల్లవారుజామునుండే మధిరలోని శ్రీమృత్యుంజయ స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు స్వామివారికి నిర్వహించిన మహరుద్రాభిషేకంతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం, కృష్ణా జిల్లాల నుండే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దేవాలయం ఎదురుగా వున్న వైరా నదిలో పుణ్యస్నానాలు అచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలలో బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా మరణించిన తమ పెద్దలకు వైరా నదిలో పిండప్రదానం చేసి మైలలు తీర్చుకున్నారు. గుడికి వచ్చిన భక్తులకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పులిహోర, మంచినీటిని పంపిణి చేసారు. అదే విధంగా అర్యవైశ్య కళ్యాణ మండపంలో అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో 10వేల మంది భక్తులకు అన్నదానం చేసారు. శివరాత్రి సందర్భంగా జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మధిర సిఐ సిహెచ్ శ్రీ్ధర్ అధ్వర్యంలో టౌన్, రూరల్, బోనకల్ ఎస్‌ఐలు తిరుపతిరెడ్డి , బండారి కిశోర్, ఇంద్రసేనారెడ్డిలు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసారు మహశివరాత్రి సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి గంగ పార్వతి సమేత శ్రీమృత్యుంజయ స్వామివారికి అంగ రంగ వైభవంగా వేదమంత్రాలతో పంచాహ్నీక దీక్షతో ఆలయ అర్చకులు రాయప్రోలు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలో మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క దంపతులు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, నగర పంచాయతీ చైర్ పర్సన్ మొండితోక నాగరాణి, ఎంపిపి వేమిరెడ్డి వెంకట్రావమ్మ, జడ్‌పిటిసి మూడ్ ప్రియాంక, టిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులను అలయ కమిటి చైర్మన్ మక్కెన నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో శాలువాలుకప్పి సత్కరించారు.
ఖమ్మం డివిజన్‌లో 6.24 లక్షల ఎకరాల సర్వే పూర్తి
మధిర, ఫిబ్రవరి 13: ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో 6,24,796ఎకరాల సర్వే పూర్తి అయిందని ఖమ్మం ఆర్డీఓ తాళ్ళూరి పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం భూసర్వే, ఆన్‌లైన్ నమోదు వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు సర్వే చేసిన భూముల వివరాల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో సాదాబైనామా, రిజిస్ట్రేషన్, వారసత్వాల ద్వారా హక్కు పొందిన 6,24,796 ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లను ఆన్‌లైన్ చేయడం జరిగిందన్నారు. ఆక్రమణలు, అసైన్‌మెంటు, ప్రభుత్వ, శికం, వ్యవసాయేతర భూములకు సంబంధించిన మరో 60వేల ఎకరాలకు సర్వే చేయాల్సి ఉందన్నారు. 2014 జూన్ 2కు ముందు 5ఎకరాలకు మించి కొనుగోలు చేసి సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసినవారికి వారు కొనుగోలు చేసిన సంవత్సరంలో రిజ్రిస్టేషన్ విలువ ప్రకారం డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు రెండురోజులలో వారికి సంబంధించిన బ్యాంకు అకౌంట్, ఆధార్‌కార్డు నెంబర్లను ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో గతంలో ఎవరైతే పట్టాదారులుగా ఉన్నారో వారినే తిరిగి పట్టాదారుగా ఆన్‌లైన్ చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో తహశీల్ధార్ మంగీలాల్ పాల్గొన్నారు.