ఖమ్మం

సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, పిబ్రవరి 16: భద్రాద్రి కొత్తగూడెం-్భపాలపల్లి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మళ్లీ మావోయిస్టు నక్సల్స్ కదలికలు మెదలైనట్లు ఇంటెలిజెన్స్, నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం రావడంతో రెండు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. చెంతనే ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్రాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని మావోయిస్టులు మెరుపు దాడులు చెయ్యడం పోలీసులకు సవాల్‌గా మారింది. మావోల కదిలికలపై ఉక్కు పాదం మోపేందుకు గ్రేహౌండ్స్ పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోలు పురిటిగడ్డపై కాలు మోపకుండ ఉత్తర తెలంగాణ జిల్లాలను నిర్బంధం చెయ్యడంతో, భారీగా నష్టపోయిన మావోలు అగ్రనేతలు నుంచి దళసభ్యులను కోల్పోయింది. చెంతనే ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో తిష్ట వేసి గోదావరి నదిని లక్ష్యంగా చేసుకొని ఉత్తర తెలంగాణప్రాంతంలో మెరుపు దాడులు చెయ్యడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. గోదావరిలో వరద నీరు తగ్గిపోవడంతో మావోలు రాక పోకలు సులువుగా కొనసాగడంతో వాళ్ల కదిలికలపై పోలీసులకు స్పష్టమైన సమాచారం లేక పోవడం ఇబ్బందిగా మారింది.
మావోలు టార్గెట్స్ నేతలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చెయ్యడం ఏజెన్సీలో ఉన్న మాజీ నక్సల్స్, సానుభూతిపరుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాలు వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా చత్తీస్‌ఘట్ నుంచి వలస వచ్చిన ఆదివాసి గిరిజనులు క్యాంపుల్లో బిక్కు బిక్కు మంటు కాలం గడుపుతున్నారు.
సమాచార వ్యవస్థను పటిష్ట పర్చుకొన్న మావోలు?
సమాచార వ్యవస్థ లోపంతో భారీగా నష్టపోయిన మావోలు ఇప్పుడు సమాచార వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నిఘా వర్గాలు సైతం అవుననే అంటున్నాయి. ముఖ్యంగా ఇందులో సెల్‌ఫోను వ్యవస్థకు స్వస్తి పలికి వాకీ టాకీలు, యాక్స్‌న్ టీమ్స్ వ్యవస్థను పటిష్ట పర్చుకొని మెరుపు దాడులు చేస్తున్నట్ల నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పినపాక మండలంలో గత నెలలో భూపతిరావుపేట గ్రామంలో మావోలు చేసిన మెరుపు దాడి ఇదే కోవకు చెందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనాకు వచ్చినట్లు సమాచారం.