ఖమ్మం

రాష్ట్రం అవినీతి మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 16: ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ నిర్మాణం అవినీతిమయమైందని, సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కాంట్రాక్టర్ల వద్దే కనిపిస్తోందని, ఒకే కాంట్రాక్టర్ జిల్లాలోని అన్ని పనులను చేపడుతున్నారని, అవన్నీ నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్‌తో అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. లకారం ట్యాంక్‌బండ్ అభివృద్ధి అంతా ఫోటోలపైనే కనిపిస్తోందని, ప్రారంభించిన మరుసటి రోజే అవినీతి తేటతెల్లమైందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతిపై విచారణ జరపాలన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అప్పజెప్పి అందినంత దోచుకుంటూ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతుందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరచి స్వప్రయోజనాలకే పాటుపడుతుందని ఆరోపించారు. మూడు సంవత్సరాలు కష్టించి సుబాబుల్ పండించిన రైతుకు కనీస గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఎర్రజొన్నను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఎర్రజొన్నతో పాటు కందులకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడుతూ రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అప్పచెప్పిందని దుయ్యబట్టారు. ట్యాంక్‌బండ్‌పై వేసిన రోడ్డు ఒక్కరోజులోనే నాసిరకమని తేలిందన్నారు. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి వారి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. యంత్రఫలం కేంద్ర నిధులకు సంబంధించిందని, స్కీంకు సంబందించిన ట్రాక్టర్లను కేవలం టిఆర్‌ఎస్ వారికే ఇప్పించుకొని, అర్హులైన వారికి దక్కకుండా చేస్తున్నారని, దీనిపై పార్లమెంట్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె హెచ్చరించారు. మున్సిపల్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. టిఆర్‌ఎస్ నేతలు అభివృద్ధి అంటూ పచ్చిఅబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని ఐదు పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్‌లో కలిపే కుట్ర జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కోదండరెడ్డి, రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.