ఖమ్మం

ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, ఫిబ్రవరి 16: క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు నియోజక వర్గ శాసన సభ్యుడు కోరం కనకయ్య సూచించారు. తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటయోధులు, కవులు దాశరధి కృష్ణమాచార్య, దాశరధి రంగాచార్య స్మారకార్ధం గార్లలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి ప్రసంగిస్తూ క్రమశిక్షణ అలవర్చుకోవటంలో క్రీడల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపుఓటములు సర్వసాధారణమైనని, ఓడిపోయామనే మథనపడకుండా గెలుపు కోసం సాధన చేయాలని, ఇందుకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాభివృద్ధికి ఎంతో సహకారం అందించటంతో పాటు భారీగా నిధుల కేటాయింపు చేస్తున్నారని కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తిరవి, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, జడ్పీటీసి ఎద్దు మాధవి, క్రీడల కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, కోకన్సీనర్ మాలోతు శివ, చుంచుపల్లి ఇఓ బూడిద అరుణ్‌గౌడ్, టీపీటీఎఫ్ ఉపాధ్యయ సంఘం మహబూబాబాద్ జిల్లా నాయకుడు వజ్రం నాగేశ్వరరావు, మండల కోఅఫ్షన్ సభ్యుడు ఎండి.ఖదీర్, ఎంపిటీసి చావళి, గార్ల ఎస్‌ఐ. సిహెచ్. వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.