ఖమ్మం

సింగరేణి ప్రభావిత బాధితులను ఆదుకోకుంటే ఆందోళనలు చేపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఫిబ్రవరి 18: సత్తుపల్లి ప్రాంతంలో సింగరేణి ప్రభావిత బాధితుల పట్ల తక్షణమే సింగరేణి సంస్థ స్పందించాలని, లేనిపక్షంలో బాధితులకు బాసటగా ప్రత్యక్ష ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి బాంబ్ బ్లాస్ట్‌ల వల్ల బీటలు వారుతున్న ఇళ్ళను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి పట్టణం ఎన్టీఆర్ నగర్‌లో 600ఇళ్ళు బాంబ్‌బ్లాస్ట్‌ల కారణంగా కూలిపోయే దశకు చేరుకుంటున్నాయని, తక్షణమే వారిని ఆదుకునేలా సింగరేణి సంస్థ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రానున్న శాసనమండలిలో ప్రస్తావించడంతో పాటు వారంరోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ఇక్కడ పరిస్థితిని చక్కబరుస్తానని తెలిపారు. సత్తుపల్లి జలగం వెంగళరావు బొగ్గుగని ప్రాజెక్టు అధికారి సంజీవరెడ్డితో సత్తుపల్లి ప్రాంతంలో హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని విలేఖరులకు చెప్పారు. అదే విధంగా సత్తుపల్లి బొగ్గుగనుల నుంచి రోడ్డు మార్గంలో రవాణా అవుతున్న బొగ్గు టిప్పర్ల ద్వారా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వేగం తగ్గించేందుకు వాహనశాఖ అధికారులతో, పోలీస్‌శాఖ, సింగరేణి సంస్థ టిప్పర్ల యజమానులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ప్రమాదాలు తగ్గేవిధంగా చూడాలని పొంగులేటి సింగరేణి పీఓకు వ్రాత పూర్వకంగా తెలిపారు. సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రామిశెట్టి మనోహర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాదిరెడ్డి సుబ్బారెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.