ఖమ్మం

అన్నదానానికి మించిన దానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 18: అన్నిదానాలలో అన్నదానానికి మించిన దానంలేదని ఎన్‌ఆర్‌ఐ లక్కిరెడ్డి బాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో బాల్‌రెడ్డి సోదరుడు లక్కిరెడ్డి జయప్రకాశ్‌రెడ్డి, అన్నపూర్ణ దంపతులు సుమారు 70లక్షల రూపాయాల వ్యయంతో నిర్మించిన శ్రీ అన్నపూర్ణ అన్నదాన భవనంను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇలవేల్పు అయిన జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంనకు తాము చిన్నతనం నుండి వస్తున్నామని, ఆయన సన్నిదిలో ఇప్పటికే చాలా సౌకర్యాలు ఆలయంలో కల్పించామని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం అరకొరగా చేస్తున్నందు వలన తాము వచ్చిన భక్తులకు అందరికి అన్నదానం లేదు అనకుండా చేయాలనే సంకల్పంతో ఈ అన్నదాన భవనంను ఖర్చుకు వెనుకాడక అన్ని వసతులతో నిర్మించామని తెలిపారు. మొదట ఎండోమెంట్ వారు 40లక్షలు ఖర్చు అవుతుందని అన్నారని, కానీ ఇప్పటికి మొత్తం 70లక్షలు ఖర్చు దాటిందన్నారు. అయినా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఈ భవనం నిర్మించామని తెలిపారు. తాము అమెరికాలో ఎంత సంపాధించినా దానిని ఆలయలకు, పేదలకు ఖర్చు పెడతున్నామని అన్నారు. దాతలను ఆలయ చైర్మన్ శివరాం ప్రసాదు, ఇవో రమణమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన తుళ్ళూరు కోటేశ్వరరావు, నిర్మల దంపతులు స్వామి వారి కళ్యాణం నిర్వహించడానికి భద్రాచలం ఆలయంలో నిర్మించిన మిధుల స్టేడియం తరహాలో నిర్మిస్తామని హమీనిచ్చారు. ఆలయంలో భక్తుల స్నానాలకు కోనేరు నిర్మాణనికి స్థపతి వల్లీనాయర్, ఇఇ నరసింహారావుల ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసి నమూనను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి
ఏన్కూరు, ఫిబ్రవరి 18: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ వివేక్ పరదేశి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని గదులను, ససకర్యాలను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, గర్భిణీ, బాలింతలకు సకాలంలో టికాలు వేస్తున్నార లేదా అని తెలుసుకున్నారు. టచకాలను భద్రపరిచే విధానం, గ్రామాలలోకి సరఫరా చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎస్సీ, బిసి కాలనీలలో పర్యటించి మహిళలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందే సేవల గురించి తెలుసుకున్నారు. డిఐఓ అలివేలు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.