ఖమ్మం

పోరాటాల ద్వారానే పార్టీ విస్తృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 18: కమ్యూనిస్టు పార్టీల విస్తరణకు పోరాటాలే మార్గమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సిపిఐ 21వ జిల్లా మహాసభల్లో ఆదివారం ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కోట్లాది మంది ప్రజల సమస్యలు కమ్యూనిస్టు పార్టీద్వారా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారని, అందుకు అనుగుణంగానే నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నీతివంతమైన పాలన అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నోట్లరద్దు, బ్యాంకుల విలీనం లాంటి నిర్ణయాలను ప్రజల మద్దతుతో వ్యతిరేకించాలన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, అక్రమార్కులు కోట్ల రూపాయలు దండుకొని దేశాలు దాటుతున్నా స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించే గొంతును నొక్కివేస్తున్న కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం వస్తున్నదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిర్భందం మరింత పెరిగిందన్నారు. తన మాటలతో కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, మాటల్లోని మర్మాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పథకాలతో వేలకోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నా స్పందించేవారు కరువయ్యారన్నారు.

పథకాల అమల్లో అవినీతిపై ఆందోళనలకు సిద్ధం కావాలి
* కార్యకర్తల సమావేశంలోఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, ఫిబ్రవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల అమలు తీరు అవినీతిమయంగా నడుస్తోందని, ఈ అవినీతిపై తెదేపా శ్రేణులు దశలవారీ ఆందోళనలకు సిద్ధమవ్వాలని సత్తుపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్‌హాల్‌లో తెదేపా నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. కార్యక్రమ ప్రారంభంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని 200మంది కార్యకర్తలకు సంక్షేమ నిధి చెక్కులను అందజేశారు. రానున్నది ఎన్నికల సీజన్ అయినందున కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు చేపట్టే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని చెప్పారు. ప్రతి పథకంలో లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మనపై ఉందని కార్యకర్తలకు తెలిపారు. లబ్ధిదారులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా తెదేపా పార్టీ నిలబడాలని, ఇందుకు మనం సిద్ధంగా ఉండాలని దశల వారీ ఆందోళనలు చేపట్టాలని కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. సమావేశంలో దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి మహేష్, చాంద్‌పాషా, అద్దంకి అనీల్, కంభంపాటి మల్లిఖార్జున్, తడికమళ్ళ ప్రకాశరావు, రూత్‌క్రిస్టియానా తదితరులు పాల్గొన్నారు.