ఖమ్మం

కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జనవరి 2: జిహెచ్‌ఎంసి ఎన్నికలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో కూడా ఒటర్ల గణణన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికలను నిర్వహించక పోవడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. అంచలవారీగా ఎన్నికలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగం, పాలక వర్గాన్ని దుర్వినియోగం చేస్తూ గెలుపే ద్యేయంగా నీచరాజకీయాలకు పాల్పడుందని దుయ్యబట్టారు, వంతుల వారిగా ఎన్నికలు నిర్వహిస్తూ అనేక అక్రమాలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడుతుందని, గెలిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని భరిలోకి దింపుతుందని పేర్కొన్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహించి తమ సత్తా చాటాలని సవాల్ విసిరారు. కార్పొరేషన్ ఎన్నికలలో కలసివచ్చే వారితో పొత్తులుంటాయని, ఒంటరిగా గెలిచే సత్తా తమపార్టీకి ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటూ మభ్యపెడుతున్న పాలకులను ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి అంటే రోడ్ల మధ్యన గోడలు కట్టడం కాదన్నారు. నగరంలో అనేక సమస్యలు పరిష్కరానికి నోచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను కూడా తమ ఖాతాలో వేసుకొని అభివృద్ది అంటున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు భూమి, పేదలకు ఇండ్లు, రైతు సంక్షేమం అంటూ ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఓటమి భయంతో ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ వెనుకడుగు వేస్తుందని, ఒకే దపా ఎన్నికలు నర్వహించి తమ సత్తా చాటుకోవాలన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు వడ్డెబోయిన నర్సింహరావు, మగ్భుల్, పాలగుర్త నాగేశ్వరరావు, విజయకుమార్, అశోక్, మహబూబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.