ఖమ్మం

అన్ని రకాల కందులను కొనుగోలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 20: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే అన్ని రకాల కందుల పంటను కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి రమేష్, మాదినేని రమేష్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్ కేంద్రాన్ని సందర్శించి మార్క్‌ఫెడ్ అధికారులతో పిఎసిఎస్ కొనుగోళ్ళలో పాటించే నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని గ్రేడ్ కందులను కొనుగోలు చేయటంతో పాటు నిబంధనలను సడలించాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తకొత్త నిబంధనలతో పంటలను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సారి పప్పు ధాన్యాలను పండించండి గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆశ పెట్టించి ఇప్పుడు కనీసం మద్దతు ధర కూడా లభించకుండా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మద్దతు ధర 5,450 కల్పించామంటూ గోప్పలు చెబుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కందుల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లభించకపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా మార్కెట్‌కు వచ్చే అన్ని గ్రేడ్ కందులను కొనుగోలు చేయటంతో పాటు రైతులకు విధించిన నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తాతా భాస్కర్, మామిళ్ళ సంజీవరెడ్డి, జాలాది సంగయ్య, షేక్ మీరాసాహెబ్, వెంకటరెడ్డి, తుశాకుల లింగయ్య, బండారు యాకయ్య, ఎస్‌కె బాబు తదితరులు పాల్గొన్నారు.

ముస్త్ఫానగర్ రోడ్డు 80 అడుగుల మేరకే నిర్మించాలి
* ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవాలి * సంతకాల సేకరణ ప్రారంభించిన బాగం
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 20: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ముస్త్ఫానగర్ రోడ్డు నిర్మాణాన్ని ప్రజాభిప్రాయం మేరకే నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అన్నారు. మంగళవారం నగరంలోని ముస్త్ఫానగర్‌లో సిపిఐ వన్‌టౌన్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బాగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్త్ఫానగర్‌లో నూతనంగా నిర్మించనున్న రోడ్డును 80అడుగులతో నిర్మించి, ఈ ప్రాంత ప్రజాభిప్రాయ సేకరణను ప్రజాస్వామ్య బద్దంగా గౌరవించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని దిక్కరిస్తూ నియంతగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అభివృద్ధి పనులు చేపడితే ప్రజాపక్షాన ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఇటీవల ఖమ్మం నగర పాలక సంస్థ, ఆర్‌అండ్‌బి నేతృత్వంలో ముస్త్ఫానగర్ నుంచి పురపాలక సంఘం బోర్డు వరకు వంద అడుగుల రోడ్డును నిర్మించేందుకు మార్కింగ్ చేశారన్నారు. కార్పొరేషన్ సమావేశాల్లో ఈ ప్రాంతంలో 80అడుగుల రోడ్డు ఉండాలని తీర్మానించినప్పటికీ ఆ తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ ఇప్పుడు వంద అడుగుల రోడ్డును నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల అభిష్టాన్ని పట్టించుకోకుండా వంద అడుగుల రోడ్డును నిర్మిస్తే తాము అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోటు ప్రసాద్, నగర కార్యదర్శి ఎస్‌కె జానీమియా, నాయకులు శ్రీనివాసరావు, చామకూరి వెంకన్న, ఏనుగు గాంధీ, పగడాల మల్లేష్, మాడుగు నాగేశ్వరరావు, మాల కొండయ్య, కంపసాటి వెంకన్న, తాళ్ళూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.