ఖమ్మం

మళ్లీ అవే స్థానాల్లో సీపీఐ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 20: గత ఎన్నికల్లో పోటీచేసిన స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు స్పష్టం చేశారు. గిరిప్రసాద్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన స్థానాల్లోనే తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. వౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, మాటలకే పరిమితమై నిధుల కేటాయింపు లేకపోవడంతో వౌలిక వసతుల కల్పన నిలిచిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నాలుగేళ్ళుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. జిల్లాలో ఖనిజ సంపద ఆధారంగా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రభుత్వం చెబుతున్నంత వేగవంతం కాలేదని, 2019కల్లా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదం ఎక్కడా కనిపించడం లేదన్నారు. అవినీతి రహితమంటూ వేలకోట్ల రూపాయలు బ్యాంకుల సొమ్ము లూటీకి మోడీ సర్కార్ పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతూ నెట్టుకొస్తుందని విమర్శించారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న కెసిఆర్ అతిగతి లేదన్నారు. మూడు నెలలుగా ఆసరా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇటీవల జరిగిన మహాసభల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం 18వేలు అమలు చేయాలని, స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని, దళిత గిరిజనులకు మూడెకరాల భూపంపిణీ, నిలిచిపోయిన పెన్షన్లు విడుదల చేయాలని, కలెక్టరేట్ తరలింపును ఉపసంహరించుకోవాలని, సుబాబుల్ రైతులకు గిట్టుబాటుధరలు కల్పించాలని తదితర 26తీర్మానాలను ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. 56మందితో కౌన్సిల్, 19మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగ్ నర్సింహరావు, యర్ర బాబు, ఎస్‌కె జానీమియా, బిజె క్లైమెంట్, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.