ఖమ్మం

సాగుచేసే ప్రతిరైతుకు పంట పథకం 8వేలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 20: రాష్ట్రంలో వివిధ రకాల భూములను సాగుచేస్తున్న రైతులందరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట పథకం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి 8వేలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భూక్యా వీరభద్రం అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం చేస్తున్న రైతులు 58 లక్షల మంది ఉన్నారని, వీరిలో 20 లక్షల మంది కౌలురైతులు, 10 లక్షల మంది పోడురైతులు, 22 లక్షల మంది ఇనామ్, దేవాదాయ, మరియు ఇతర వ్యవసాయ భూములను సాగుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ రైతులకు పంట పధకం వర్తించకుండా రికార్డుల ప్రకారం పట్టా కలిగిన రైతులకే ఈ పధకాన్ని వర్తింపజేయడం వల్ల అసలు వ్యవసాయం చేస్తున్న రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాలో పోడురైతులు, కౌలురైతులకు ఈ పధకం వర్తించకుండా కౌలుకిచ్చినవారికే ఆర్ధికంగా సహాయం చేయడంలో మర్మమేమిటో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్ చట్టంచేసిన అటవీహక్కుల చట్టాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా చట్టాన్ని అపహాస్యం చేస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గిరిజన రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగుచేసే రైతులకు ఈ పధకం వర్తించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో మార్చి నెలలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పోరాటాల్లో రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, వేదగిరి శ్రీనివాసరావు, తాళ్ళపల్లి కృష్ణ,కొండబోయిన నాగేశ్వరరావు, నాయకులు సుంకర సుధాకర్,తోట నాగేశ్వరరావు, బోడేపుడి వీరభద్రం, కె నరేంద్ర, ఏర్పుల రాములు, వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా-డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
* రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పక్షాల డిమాండ్
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 20: ఫార్మా-డి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పలు రాజకీయపక్షాలు డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 20రోజులుగా వారు స్థానిక ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఆంధోళనలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి పార్టీల నాయకులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బాలగంగాధర్‌తిలక్, కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, బాగం హేమంతరావు, బత్తుల లెనిన్, ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై మండిపడ్డారు. గత 20రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. సమస్యను పరిష్కరించేంత వరకు వారు చేస్తున్న దీక్షలకు తాము అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే వెంకటవీరయ్య మాట్లాడుతూ ఫార్మాడి విద్యార్థులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికి వారికి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించటం లేదని ప్రశ్నించారు. వైద్య రంగంలో ప్రజలకు సేవ చేసే విషయంలో ఫార్మాడి విద్యార్థులు ఎంతో కీలకపాత్ర వహిస్తారన్నారు. రోగికి మందులు ఎంత మోతాదులో వినియోగించాలో వారే నిర్ణయించాల్సి ఉందన్నారు. అటువంటి విద్యార్థులపై ప్రభుత్వం చిన్న చూపు చూడటం సమంజసంకాదన్నారు. విద్యార్థుల సమస్యను అసెంబ్లీలో చర్చిస్తానని హమీనిచ్చారు. ఈ సమావేశంలో విద్యార్థి యువజన సంఘాలతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.