ఖమ్మం

అభయహస్తం అమలుకు ప్రభుత్వంలో కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 20: అభయహస్తం పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2009లో ఈ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 60సంవత్సరాలు నిండిన మహిళలకు భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో రోజుకు రూపాయి చొప్పున సంవత్సరానికి 360రూపాయలను సభ్యులు జమచేస్తే ప్రభుత్వం కూడా అదే మొత్తంలో జమచేసి పథకాన్ని కొనసాగించారు. అప్పట్లో 1,35,155మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 5,441మంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో పెన్షన్ పొందేందుకు అర్హులుగా ఉన్నారు. వీరికి నెలకు 500రూపాయలు తగ్గకుండ పెన్షన్‌ను అందజేశారు. అంతే కాకుండ సభ్యుల ప్రమాదవశాత్తు మరణిస్తే 75వేలు, సహజ మరణం సంభవిస్తే 30వేలు ఇచ్చేవారు. దీనికితోడు సభ్యుల పిల్లలకు 9నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలకు ఉపకార వేతనాలు కూడా లభించేవి. 2015నుండి 16వరకు 16,644మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులుగా గుర్తించారు. పథకం ప్రారంభంలో అన్ని సక్రమంగా నడిచినప్పటికీ ఆ తర్వాత కాలంలో పెన్షన్‌తో పాటు విద్యార్థుల ఉపకార వేతనాలను సైతం నిలిపివేశారు. గత మూడేళ్ళకు పైగా ప్రిమియం చెల్లించి అర్హులైన అభయహస్తం పథకం లబ్దిదారులకు పెన్షన్ నిలిపివేయడమే కాకుండ ఎటువంటి లబ్ది చేకూర్చడంలేదు. దాదాపు 200కోట్ల రూపాయల మేర పెన్షన్ల రూపంలో లబ్దిదారులకు అందాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం ఈ పథకాన్ని ఉచితంగానే అమలు చేయాలని నిర్ణయించింది. సభ్యుల ప్రిమియం సైతం ప్రభుత్వం చెల్లించేందుకు నిర్ణయించింది. అంతే కాకుండ బీమా పథకాన్ని కూడా పెంచింది. గతంతలో సభ్యులు సహజ మరణానికి 30వేలు చెల్లించగా ప్రస్తుతం 2లక్షలు, ప్రమాదవశాత్తు మృతిచెందిన వారికి 4లక్షలు, శాశ్వత అంగవైకల్యం చెందిన బాదితులకు 2లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం సంభవించిన వారికి లక్ష రూపాయలు చెల్లించనున్నది. అంతేకాకుండ భర్త సహజ మరణం పొందితే 2లక్షలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే 4లక్షలు ఇవ్వనున్నారు. ఇద్దరు పిల్లలకు ఉపకార వేతనంగా 9,600రూపాయలు అందజేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. లబ్దిదారులకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలలో భారీ మార్పులు చేయడంతో పాటు గతంలో లబ్ధిదారులు చెల్లించిన ప్రిమియంను సైతం వాపసు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడేళ్ళకు పైగా అభయహస్తం పథకాన్ని పట్టించుకోక పోవడంతో సభ్యులు తీవ్ర నిరాశకు గురైయారు. ప్రభుత్వ నూతన నిర్ణయంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.