ఖమ్మం

క్షేత్ర స్థాయిలో దళిత సంక్షేమ పథకాలను అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసి దళితులందరికీ న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుమ్మరి గోపాల్, మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం దళిత సంక్షేమ పథకాలన్నింటినీ పకడ్బందీగా అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఖమ్మం రూరల్ తహశీల్దార్‌కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితులు అన్ని రంగాలలో వెనుకబడివున్నారని, సమానత్వం, సామాజిక న్యాయం, కుల వివక్ష, ఆర్థికాభివృద్ధి వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులను హరించివేస్తున్నారని, దళితులకు మూడెకరాల కెసిఆర్ వాగ్ధానం హామీగానే మిగిలిపోయిందని, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. ఇప్పటికైనా పాలకులు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర నాయకులు చింతా సూరిబాబు, జిల్లా కమిటీ సభ్యులు నకిరికంటి కృష్ణ, బొడ్డు పాపారావు, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన ఫార్మా-డి విద్యార్థులు
* నేటి నుండి నిరవధిక నిరాహారదీక్షలు
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 23: ఫార్మా-డి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జిఓ నెంబర్ 53ని అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఫార్మా-డి విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 23రోలుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టి పలు రకాల ఆంధోళనలు నిర్వహించినప్పటికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో విద్యార్థులు తమ ఉద్యమ స్వరూపాన్ని మార్చుకొన్నారు. ఉద్యమాన్ని ఉదృతం చేయాలనే ఆలోచనతో శుక్రవారం నుండి వారు నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టారు. స్థానిక ధర్నాచౌక్‌లో దీక్షలకు అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు అండగా నిలిచాయి. జర్నలిస్ట్ సంఘాలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దీక్షలో ఫార్మా-డి విద్యార్థుల సంక్షేమ సంఘం నాయకులు బారి నరేష్, శివాని, వంశీ, హేమంత్, రజనీకాంత్, లావణ్య, వౌనిక తదితరులు పాల్గొన్నారు.