ఖమ్మం

నాలుగేళ్లలో ఏ హామీనీ నెరవేర్చలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఫిబ్రవరి 23: టీఆర్‌ఎస్ తన నాలుగేండ్ల పదవీకాలంలో ప్రజలకిచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేకపోయారని మాజీ మంత్రి, సత్తుపల్లి నియోజకర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సంభాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం సత్తుపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పడానికి ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, కెజి టు పిజి ఉచిత విద్య ఇలా అనేక హామీల అమలులో పూర్తిగా విఫలం చేందారని విమర్శించారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే ఎదురయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వపరిపాలన వస్తే తెలంగాణ ప్రాంతంతో పాటు ప్రజలు అభివృద్ధి చెందుతారనే భావనతో సోనియా గాంధీ తెలంగాణను ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కెసిఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వ పాలన ప్రజలను మరింత ఇబ్బందులు తెచ్చి పెట్టిందన్నారు. నోట్ల రద్దు దగ్గరనుంచి జీఎసిటి, పెట్రో ధరలు పెంచడం ఇలా అనేక రకాలుగా ప్రజలను హింసకు గురిచేశారని విమర్శించారు. ఇటీవల కొత్తగా వచ్చిన వేలిముద్రల యంత్రాలు సక్రమంగా పనిచేయక పోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛనుదారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా వచ్చే ఎన్నికల కోసం ముందుగానే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను బెదిరించి పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన సాగుతున్న విషయాన్ని గమనిస్తున్న ప్రజలు రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఒడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్‌రాజు, పరెడ్ల సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఉడతనేని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సుబాబుల్ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
ఏన్కూరు, ఫిబ్రవరి 23: జిల్లాలోని సుబాబుల్ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగుతాయని రైతుసంఘం జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక వ్వవసాయ మర్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం పార్టీలకు అతీతంగా సుబాబుల్ రైతులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐటిసి సంస్థ సుబాబుల్ రైతుల జీవితాలతో ఆడుకొంటుందని అన్నారు. సుబాబుల్ వేసే సమయంలో ఐటిసి వారు చెప్పిన నిబందనలకి, కొనుగోలు సమయానికి మాటమారుస్తు మద్య దళారీలతో రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఐటిసి నిబందనలు తొలిగించి ప్రభుత్వమే వ్వవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర కలిపించాలని డిమాండ్ చేసారు. తొక్కతీసే యంత్రాలను నిషేదించాలని టన్నుకు రూ. 5వేలు గిట్టుబాటు ధర కలిపించాలన్నారు. సుబాబుల్ రైతులకు న్యాయం జరిగే వరకు పార్టీలకు అతీతంగా రైతులంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, వాసిరెడ్డి నాగేశ్వరరావు, రామారావు, గుమ్మడి నర్సయ్య, అప్పారావు, వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.