ఖమ్మం

సంత్ సేవాలాల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, ఫిబ్రవరి 23: సంత్ సేవాలాల్ ఆశయాలను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కామేపల్లిలోని రైస్‌మిల్లు ప్రాంగణంలో నిర్వహించిన సంతూ సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్ని ప్రసంగిస్తూ లంబాడీల ఆరాధ్య దైవమైన సంతూ సేవాలాల్ మహరాజ్ ఒకరని, కులా దైవంగా భావించి ప్రతి ఒక్కరు ఆరాధిస్తారని తెలిపారు. ఆయన సేవా మార్గంలో ప్రతి ఒక్క గిరిజనుడు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి నిధులు కేటాంయించడం జరిగిందని, దేశంలో లంబాడీలు నివాసిస్తున్నప్పటికి జయంతి వేడుకలను ఏ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల మనోభావాలను గుర్తించి ఆయా వర్గాలకు సముచిత్త స్ధానం కల్పించిందని దీని అందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వందించాలని కోరారు. గిరిజనులంతా సమైక్య భావంతో ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. సేవాలాల్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. సభకు ముందు గిరిజన మహిళలు బోనాలతో ఉత్సవ స్ధలానికి గిరిజన నృత్యాలు చేస్తూ ప్రదర్శనగా తరలివచ్చారు. ప్రదర్శనలో ఎమ్మెల్యే అగ్రభాగాన నిలిచారు.అనంతరం మహభోగ్ బాండారో కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిఎప్ రాష్ట్ర కార్యదర్శి సపావట్ కిషన్‌నాయక్ ఆహ్వానితుడిగా, సభ అధ్యక్షులుగా నాగేంద్రబాబుతో పాటు సంజీవినాయక్,ఎంపిపి మాళోత్ సరిరాంనాయక్,రామారావు,మంగ్యాజీనాయక్,ఎంపిటిసి అజ్మీరా చిన్ని,సర్పంచ్ అజ్మీరా హరినాయక్, విద్యుత్ ఎడి హిరాలాల్,బన్సీలాల్ తదితరులు పాల్గ్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి లంబాడీలు అధికంగా పాల్గొన్నడం విశేషం.