ఖమ్మం

సర్వేలతో ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 23: ఎన్నికలు ఏడాదిలోపే జరగునున్నాయనే ప్రచారం ఒక వైపు రాజకీయ పార్టీల నేతల్లో ఆందోళన కలిగిస్తుండగా కొంత మంది విద్యార్థులు నిర్వహిస్తున్న సర్వేలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు రహస్యంగా నిర్వహిస్తున్న ఈ సర్వేలలో ప్రభుత్వ పనితీరు, స్థానిక శాసన సభ్యుడి విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్న విధానం, ఆ పార్టీ నేతలపై అభిప్రాయం అడుగుతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కొంత మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ తరహా సర్వేను చేయిస్తున్నట్లు సమాచారం. సదరు విద్యార్థులు మాత్రం ఓ జాతీయ మీడియాకు అనుబంధంగా సర్వే చేస్తున్నమని చెప్పటం గమనార్హం. ఒక నియోజక పరిధిలో 4వేల నుండి 5వేల వరకు ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇదంతా రహస్యంగా జరుగుతున్నదని, దీనిని బహిర్గతం చేయవద్దని చెప్పటం గమనార్హం.
కాగా దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాల పనితీరు స్థానిక శాసన సభ్యుడి పనితీరు, వ్యవహరశైలి, సంక్షేమ పథకాలు అందుతున్న విధానం ప్రధానంగా అడుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపై కూడా అడుగుతున్నారు. అలాగే సదరు పార్టీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారో వివరించాలని కోరటం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల పేర్లతో జాబితా రాగా, తాజాగా సర్వేలతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంటోంది. ఈ సర్వేలు తమ పార్టీ పెద్దలే చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో తమకు అనుకులంగా రాకపోతే తమకు టికెట్టు ఇవ్వరేమోననే ఆందోళన కూడా టికెట్ కోసం పోటీలలో ఉన్న అభ్యర్థుల్లో కనిపిస్తుంది. అధికార పార్టీ శాసన సభ్యులు ఉన్న ప్రాంతాలలో సిఎం కెసిఆర్ ఈ సర్వే చేయిస్తున్నారని బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కొంత మంది టికెట్‌లు ఇవ్వరనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ సర్వేలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల అనుచరులు సర్వే బృందాన్ని కలిసి తమ నేతకు అనుకులంగా ఉండేలా చూడాలని చెప్పటం గమనార్హం. వైరా, కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాలలో ఈ పరిస్థితి తేటతెల్లమవుతోంది. అయితే సదరు విద్యార్థులు మాత్రం అదేమి లేదంటూ అక్కడి నుండి వెళ్ళిపోవటం విశేషం.