ఖమ్మం

దోపిడీకి గురవుతున్న పెట్రోల్‌బంక్ వర్కర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఫిబ్రవరి 25: ఖమ్మం జిల్లాలో పెట్రోల్‌బంక్ వర్కర్లు నిలువు దోపిడీకి గురవుతున్నారని, వీరికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనంతో పాటు 8గంటల పనివిధానం అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి శింగు నర్సింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం విశ్వశాంతి స్కూల్ నందు యన్. రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింహారావు ముఖ్యఅతిధిగా పాల్గొని కార్మికులనుద్ధేశించి మాట్లాడారు.రాష్ట్రంలో కార్మికుల పోరాటాల ఫలితంగా పెట్రోల్‌బంక్ వర్కర్లకు ప్రభుత్వం కనీస వేతనాలు నిర్ణయిస్తూ జీఓ నెం. 89 విడుదల చేసిందన్నారు. దీని ప్రకారం పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు రోజుకు8గంటల పనికి నెలకు రూ.8,556లు నిర్ణయించిందన్నారు.కాని జిల్లాలో కార్మికులు 12గంటల పాటు శ్రమిస్తున్నప్పటికి బంక్ యజమానులు కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుందని విమర్శించారు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కనీసవేతనం నెలకు రూ.18వేలు నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక శాఖ అధికారులు కనీస వేతనం అమలే చేయడంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని కోరారు.
కార్మికులకు అదనపు పనికి రెట్టింపు వేతనాన్ని ఇప్పించాలని లేనట్లయితే ఏఐటియుసి ఆధ్వర్యంలోసమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో నాయకులు డిఎన్ చారి,టి. యోబు, జి.రవి, పద్దయ్య, కిషోర్, శ్రీనివాసరావు, రాంబాబు, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.