ఖమ్మం

డబుల్‌బెడ్‌రూం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనకల్, ఫిబ్రవరి 25: డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కొటేశ్వరరావు సూచించారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాల మాట్లాడుతూ సిఎం కేసిఆర్ చిరకాల స్వప్నం నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణమేనన్నారు. గ్రామాల్లో నిరుపేదలను గుర్తించి నిర్మాణాలు పూర్తవగానే ఎటువంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ఇంకా అర్హులైన లబ్ధిదారులు మిగిలి ఉంటే రాష్ట్ర మంత్రి తుమ్మలతో మాట్లాడి మంజూరు చేయిస్తానని హమి ఇచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రభుత్వ స్ధలాలు ఉన్న చొట మాత్రమే ఇళ్ళు నిర్మాణం జరుగుతుందని త్వరలో అన్ని గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల కమల్‌రాజు, బంధం శ్రీనివాసరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.