ఖమ్మం

టీపీసీసీ అధ్యక్షుని సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, ఫిబ్రవరి 25: రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ టిఆర్‌ఎస్ నాయకుడు సామా మోహన్‌రెడ్డి, ఎంపిటిసి మాళోత్ రాంచందర్‌నాయక్ అధ్వర్యంలో సుమారు 250మందికి కుటుంబాలకు పైగా టిఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి గాంధీ భవన్‌లో టిపిసిసి నేతల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. భారీగా చేరిన కార్యకర్తలను ఉద్ధేశించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు విస్మరించి తన కుటుంబ పాలన కొనసాగిస్తుందని, హమీలు నేరవర్చకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహనికి గురైనట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ గెలుపును ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. టిఆర్‌ఎస్‌ను వీడి పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, ఏ సంఘటనైనా తమ దృష్టికి వెంటనే తీసుకొచ్చిన్నట్లయితే ఆయా సమస్యల పై స్పందిస్తామని తెలిపారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో భారీగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుచ్చకాయల వీరభద్రం, మండల అధ్యక్షులు ఆంతోటి అచ్చయ్య, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, బానోత్ హరిప్రియ, రాంచందర్‌నాయక్, గోపిరెడ్డి, రాందాస్‌నాయక్ తదితర ప్రముఖులు ఉన్నారు.