ఖమ్మం

రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 13: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్ట్భాషేక మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలపై గ్రామ పంచాయితీ, ఇరిగేషన్, ఆర్‌డబ్య్లూఎస్, విద్యుత్, ఫైర్, వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్, పోలీసు, మత్స్యశాఖ అధికారులతో మంగళవారం ఆమె డివిజన్‌స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవమి ఉత్సవాలకు సమయం సమీపిస్తున్నందున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని, అన్ని శాఖల అధికారులు డ్యూటీ పాస్‌ల విషయంలో రెండు రోజుల ముందుగానే తీసుకొని విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, గ్రామ పంచాయితీ తరుపున శానిటేషన్‌పై దృష్టిసారించాలన్నారు. దేవాదాయశాఖ ద్వారా నవమి, పట్ట్భాషేకం మహోత్సవాలపై ప్రచారాన్ని చేపట్టాలన్నారు. దేవాదాయశాఖ ద్వారా రామాలయ పరిసర ప్రాంతాలు, మిథిలాస్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, బారీకేడ్లను స్టేడియం వద్ద ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధతో స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉగాది తర్వాత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు భద్రాచలం వచ్చి ఏర్పాట్లు పరిశీలిస్తారన్నారు. సమావేశంలో తహసిల్దార్ రామకృష్ణ, సర్పంచి శే్వత, పంచాయితీ ఈవో శ్రీనివాసులు, ఎంపిడివో రమాదేవి, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సింగరాజు, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.