ఖమ్మం

రేపటి నుండి పదవతరగతి పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మార్చి 13: ఈ నెల 15నుంచి ప్రారంభం కానున్న పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు ఖమ్మం జిల్లాలో మొత్తం 18,428మంది రెగ్యులర్ విద్యార్థులు, 739మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 88రెగ్యులర్ పరీక్షా కేంద్రాలు, 4ప్రైవేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం ఆయా సెంటర్లలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండ సౌకర్యాల కల్పనకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ విద్యాశాఖను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఆటకం కలగకుండా, తాగునీటి సమస్యలు తలెత్తకుండ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. పబ్లిక్ పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌లు పర్యవేక్షించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని నిబంధనలు అమలుచేయనున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూయించివేస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేస్తూ, ఎటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఈ పరీక్షలకు 1నిమిషం ఆలస్యం నిబంధన అమలు చేస్తుండటంతో పరీక్ష సెంటర్లకు గంట ముందే విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభం తేదీకంటే ముందు రోజే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అడ్రస్ ధృవీకరించుకోవాలి. హాల్‌టిక్కెట్, పరీక్ష సామాగ్రి పరీక్షప్యాడ్, పెన్ను, జామెంట్రీ బాక్స్‌లు తీసుకొని ఉదయం 9.30గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు గంట ముందే తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభానికి ముందు విద్యార్థులకు ఒక మెయిన్ ఆన్సర్‌ఎడిషన్, ఒక బార్‌కోడ్ గల ఓఎంఆర్‌ను ఇస్తారు. ఓఎంఆర్‌లో వివరాలు నింపిన తర్వాత పరీక్షపత్రం పూర్తిగా చదివి అవగాహన చేసుకునేందుకు 15నిమిషాల సమయం కేటాయిస్తారు. విద్యార్థులు యూనిఫాంలో కాకుండ సివిల్‌డ్రెస్‌లో మాత్రమే పరీక్షలకు హాజరుకావల్సి ఉంటుంది. హాల్‌టిక్కెట్లపై ఫోటో జతపర్చని వారు రెండు పాస్‌పోర్టు సైజ్ పోటోలు తీసుకకెళ్ళి ఒక ఫోటోను హాల్‌టిక్కెట్‌పై జతపరిచి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ధృవీకరణ పొంది, మరొక ఫోటోను సంబంధిత పరీక్ష కేంద్రంలో ఇవ్వాలి. హాల్‌టిక్కెట్లలో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల పేరు, మీడియం, పరీక్ష కేంద్రం అడ్రస్ తదితర అంశాలను క్షుణంగా పరిశీలించి ఏవైన తప్పులు ఉంటే సంబంధిత పాఠశాల ప్రాధానోపాధ్యాయులు, పరీక్ష కేంద్రం ఛీప్ ఎగ్జామినర్ దృష్టికి తీసుకుపోవాలి.

విద్యార్థులు చేయకూడనివి
పరీక్ష సమయం పూర్తికాక ముందే పరీక్షహాల్ నుండి బయటకు రాకూడదు. సెల్‌ఫోన్, కాలిక్యూలేటర్, బ్లూటూత్, పేజర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తమ వెంట తీసుకువెళ్ళకూడదు. సమాధాన పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నా, చూచి రాసేందుకు ప్రయత్నించిన వారిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తారు. బిట్‌పేపర్, మ్యాప్, గ్రాఫ్‌లను మెయిన్ ఆన్సర్ ఎడిషన్‌కు జతచేయాలే తప్ప విద్యార్థులు తమ వెంట తీసుకెళ్ళకూడదు. ఆన్సర్‌షీట్‌పై ఎటువంటి నిషిద్దమైన ఆశ్లీల పదాలను రాయకూడదు, అలారాస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయకుండా విద్యాచట్టం కింద చర్యలు తీసుకుంటారు. ఆన్సర్‌షీట్ నుంచి కాగితాలను చింపడం, వేరుచేయడం కానీ ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు.