ఖమ్మం

ఖమ్మం కాంగ్రెస్‌లో లొల్లి * పట్టించుకోని పీసీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 13: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఏర్పడిన సమస్య పట్టించుకునే వారే లేరు. అసలే వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీలో తాజాగా ఏర్పడిన సమస్యలు పరిష్కరించే వారు లేకపోగా నేతల మధ్య ఉన్న విభేదాలు మరింత పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీని కాదని టాస్క్ఫోర్స్ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను కూడా టాస్క్ఫోర్స్ పేరుతో రద్దు చేస్తుండటం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడమేనని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బండి మణికి పనితీరు సరిగ్గా లేదంటూ నోటీసు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇదే విధంగా రైతు విభాగం అధ్యక్షుడికి కూడా నోటీసులు వచ్చినట్లు సమాచారం. అయితే తామెవరికి నోటీసులు ఇవ్వలేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం చెబుతుండగా ఈ నోటీసులతో పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమయిన మాట వాస్తవమే. ఇదిలా ఉండగా మండలాల్లో కాంగ్రెస్ బిసిసెల్ ఆధ్వర్యంలో బిసి కాంగ్రెస్ కమిటీలను ఇటీవల నియమించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడికి ఫిర్యాదులు అందగా టాస్క్ఫోర్స్ అనుమతి లేకుండా నియామకాలు ఏంటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొన్నది. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఇంతవరకు కమిటీలు వేయలేదు. ఇది వేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ నేతల మధ్య అయోమయాన్ని సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిసిసిని కోరామన్నారు. మరోవైపు టిపిసిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క రాష్ట్రంలో కీలకంగా ఉన్నారని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఆయన ప్రమేయం లేకుండా నియామకాలు జరుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుమతితో కొందరిని నియమించినా టాస్క్ఫోర్స్, నోటీసుల పేరుతో వారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ శ్రేణులకు కొత్తగా వచ్చిన సమస్య పరిష్కరించకపోతే మరింత ఇబ్బందికలిగే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల తరువాత భట్టివిక్రమార్క జిల్లాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని మరోనేత వ్యాఖ్యానించారు.