ఖమ్మం

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, మార్చి 19: తండ్రి అకాల మరణంతో కొడుకులు లేని లోటును కూతురు తీరుస్తూ తలకొరివి పెట్టిన సంఘటన సోమవారం మండల కేంద్రమైన కామేపల్లిలో చోటుచేసుకుంది. కామేపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఇతనికి విజయ, నాగమణి అనే కూతుర్లు ఉన్నారు. పుత్ర సంతానం లేకపోవడంతో తన తండ్రికి అంత్యక్రియల బాధ్యత కూతుర్లే చేపట్టారు. బంధువుల సహకారంతో పెద్ద కూతురైన విజయ తండ్రి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించింది. కొడుకు లేని లోటును కుమార్తెలు తీర్చడంతో బంధువులు సంతృప్తి చెందారు.

అసెంబ్లీలో బ్రాహ్మణుల సమస్యలను ప్రస్తావించిన ఖమ్మం ఎమ్మెల్యే
ఖమ్మం(ఖిల్లా), మార్చి 19: బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకునే సంకల్పంతో బ్రాహ్మణ పరిషత్‌కు వంద కోట్లు కేటాయించారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద బ్రాహ్మణులు 75శాతం సబ్సిడీతో చిన్న వ్యాపారులు చేసుకునేందుకు వీలు ఉన్నప్పటికీ అందులో కొంత ఇబ్బందుతులు ఉన్నాయని విన్నవించారు. విద్యార్థులు వివేకానంద పథకం ద్వారా విదేశి విద్యను అభ్యసించే వారు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆయా సమస్యలపై స్పదించి తగుచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ
ఖమ్మం(క్రైం), మార్చి 19: స్థానిక ప్రకాష్‌నగర్‌లో గల కమాండ్ కంట్రోల్ భవనం నందు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ కార్యాలయాన్ని పోలీస్‌కమిషనర్ తఫ్సీర్‌ఇక్భాల్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎసిపి సదానిరంజన్, రూరల్ ఎసిపి నరేష్‌రెడ్డి, సిసి ఆర్భి ఎసిపి బి రామానుజం, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎన్ అంజలి, సిఐలు తిరుపతిరెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.