ఖమ్మం

వచ్చేనెల సీపీఎం జాతీయ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్మం, మార్చి 19: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అఖిల భారత 22 మహాసభల విజయవంతానికి జిల్లాలో అనేక రూపాల్లో ప్రచారం నిర్వహించాలని, తెలంగాణలో 27 సంవత్సరాల తరువాత ఈ మహాసభలు ఏప్రిల్ నెల చివరిలో హైదరాబాద్‌లో జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కిందిస్థాయి వరకు తీసుకెళ్ళాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సుందరయ్యభవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జిల్లా కమిటీ సభ్యుల, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల మూలంగా దేశంలోని సకల జనులు ఇబ్బందులకు గురౌతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన సమస్యలతో సతమతవౌతున్నారని వివరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎం 22వ అఖిలభారత మహాసభల విజయవంతానికై జిల్లాలో అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశామన్నారు. ఈ నెల 29న రాష్టస్థ్రాయి బస్‌యాత్ర జిల్లాలోని కూసుమంచి వద్ద ప్రవేశించి, ఖమ్మం, బోనకల్, వైరా మీదుగా ఏన్కూర్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశిస్తుందని, దీనిని జయప్రదం చేయాలని లన్నారు. ఏప్రిల్ 1వ తేదిన అన్ని మండల కేంద్రాలలో సెమినార్‌లు, 10న ప్రతి ఇంటిపై సిపిఎం జెండా ఎగరవేయటం, 16న మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహించటం జరుగుతుందన్నారు. మహాసభల సందర్భంగా 5వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, బండి రమేష్, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు పాల్గొన్నారు.

నవమి ఉత్సవాలకు గవర్నర్, సీఎం రాక
భద్రాచలం టౌన్, మార్చి 19: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి, మహాపట్ట్భాషేకం ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ భద్రాచలం వస్తున్నారని, జిల్లా అధికారులు తమకు కేటాయించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం శ్రీరామనవమి, మహా పట్ట్భాషేకం ఉత్సవాల సందర్భంగా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ముఖ్య ప్రణాళిక అధికారికి రెండు రోజుల్లో అందజేయాలన్నారు. సమాచారం అందజేయకుండా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు తమకు కేటాయించిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భద్రాచలంలోనే ఉండి పనులు సత్వరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులకు విధులు కేటాయించామన్నారు. కల్యాణ మండపంలో ఏర్పాట్ల పర్యవేక్షణ, భక్తులకు సేవలు అందించేందుకు జిల్లా అధికారులు విధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన విధుల్లో నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. రహదారుల పక్కన వ్యర్థాలు పేరుకుపోయి అపరిశుభ్రత ఏర్పడిందని, రెండు రోజుల్లో వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పినపాక పట్టీనగర్ వద్ద రహదారికి ఇరువైపులా వ్యర్థాలు పేరుకుపోతే ఎందుకు పట్టించుకోవడం లేదని సంబంధిత కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాల తొలగింపునకు తక్షణం చర్యలు చేపట్టాలని, అలసత్వం వహించి తాత్సారం చేస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. భద్రాచలం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఫ్లెక్సీలను తొలగించి స్వామివారికి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు పనుల పురోగతిపై తనకు సమాచారాన్ని అందజేయాలన్నారు. నవమి పనులను ముందుగానే పూర్తి చేసి భక్తులకు కావాల్సినవన్నీ సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్‌డీసీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో జగత్‌కుమార్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ డీడీ రామ్మూర్తి, ఏపీవో జనరల్ భీమ్‌రావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్రీడాభివృద్ధికి మెరుగైన వసతులు
ఖమ్మం(క్రైం), మార్చి 19: జిల్లాలో క్రీడల అభివృద్ధికి మైరుగైన వసతులు కల్పిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో కమిటీ వైస్ చైర్మన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్భాల్‌తో కలిసి కమిటి సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. వైరా ఇండోర్ స్టేడియం, మధిర, పాలేరు, లచ్చగూడెం మిని స్టేడియంలతో పాటు సర్ధార్‌పటేల్ స్టేడియంలో అభివృద్ధి పనులను వేసవి కాలం ముందే పూర్తిచేయాలని సంబంధిత అధికాలరులను ఆదేశించారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్ ప్రాంగణంలో రైఫిల్ షూటింగ్ శిక్షణ ఏర్పాటుకు 10లక్షల రూపాయలతో పనులు చేపట్టేందుకు కమిటీ ఆమోదించిందన్నారు. వేసవిలో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాలని శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు పోటీలను నిర్వహించి వారిని ప్రోత్సాహించేందుకు తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ ఓపెన్ అధ్లెటిక్ చాంపియన్‌షిప్, జాతీయస్థాయిలో పాటియాలో జరిగిన ఇండియన్ గ్రౌండ్ టెక్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ విజేత సిహెచ్ సుధాకర్, 33వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌లో విజేతలు ఎస్ సాయి, డి రాంప్రసాద్‌లకు మెడల్స్‌తో సత్కరించి సర్ట్ఫికెట్లను కలెక్టర్, సిపిలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, ఆర్ అండ్ బి ఎస్సీ నర్సింహమూర్తి, యువజన సర్వీసుల అధికారి లక్ష్మారెడ్డి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.