ఖమ్మం

టీఎన్జీఓ ఎన్నికల్లో ఏలూరి ప్యానెల్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 22: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏలూరి శ్రీనివాసరావు ప్యానెల్ ఘనవిజయం సాధించింది. టీఎన్జీఓ రాష్ట్ర, జిల్లా కమిటీల మద్దతు కలిగిన ఈ ప్యానల్‌తో పోటీపడిన టీఎన్జీఓ మాజీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ప్యానెల్‌లో ఎవరూ విజయం సాధించకపోవడం గమనార్హం. మొత్తం ఓట్లు 1194కాగా అందులో 1069ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కోసం ఆరు బూత్‌లను ఏర్పాటు చేయగా కౌంటింగ్ కోసం ఆరు టేబుళ్ళు ఏర్పాటు చేసి మూడు రౌండ్లలో పూర్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్‌కి రప్పించడంలో పోటీలో ఉన్నవారు సఫలం అయ్యారు. మొత్తం ఏడుగురు డైరెక్టర్లకు గానూ 15 మంది పోటీపడగా ఏడుగురు కూడా ఏలూరి శ్రీనివాసరావు ప్యానెల్ అభ్యర్థులే విజయం సాధించారు. జనరల్ కేటగిరిలో నలుగురిని ఎన్నుకోవాల్సి ఉండగా తొమ్మిదిమంది పోటీ పడ్డారు. అందులో ఏలూరి శ్రీనివాసరావుకు 752, జి నరేంద్రకు 685, పెద్దమళ్ళ సత్యనారాయణకు 630, మూట గోపాల్‌కు 612 ఓట్లు రావడంతో వీరు గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ఎన్‌విఎస్ ప్రసాద్ ప్రకటించారు. పోటీలో ఉన్నవారిలో అఫ్జల్ హసన్‌కు 289, కూరపాటి రంగరాజుకు 359, జగన్మోహన్‌రావుకు 58, తుమ్మా రవీందర్‌కు 295, ఎల్ గోపాల్‌రావుకు 257ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్సీ విభాగంలో పోటీపడిన టిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామయ్య తన సమీప ప్రత్యర్థి వీరనారాయణపై ఘన విజయం సాధించారు. మహిళా విభాగంలో వేల్పుల విజేత, వెంకటనర్సమ్మ, అక్తరున్నీసాబేగం, బొడ్లపాటి సరస్వతి పోటీపడగా ఏలూరి శ్రీనివాసరావు ప్యానెల్‌కు చెందిన వెంకటనర్సమ్మ, అక్తరున్నీసాబేగంలు విజయం సాధించారు. గెలుపొందిన ఏడుగురు శుక్రవారం సహకార అధికారి ఏదుట హాజరై అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు, రామయ్యలు మాట్లాడుతూ సొసైటీ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కాలనీల అభివృద్థికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో పలు అక్రమాలకు పాల్పడిన వారికి సభ్యులు గుణపాఠం చెప్పారని వెల్లడించారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా సహకార అధికారి జుంకీలాల్, కె వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ అధికారి రాజేశ్వరశాస్ర్తీ పాల్గొన్నారు.

విజయోత్సవ ర్యాలీ
టిఎన్‌జివోస్ కోపరిటివ్ హౌజ్‌బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఏలూరి శ్రీనివాస్‌రావు ప్యానల్‌కు చెందిన 7గురు డైరెక్టర్లతో ఉద్యోగులు గురువారం నగరంలో పెద్దఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానికి టిఎన్‌జివోస్ ఫంక్షన్‌హాల్ కేంద్రం వద్ద ఫలితాల కోసం వందలాది మంది ఉద్యోగులు వేచిఉన్నారు. సాయంత్రం 7గంటల సమయంలో ఫలితాలు వెలువడటంతో కేంద్రం వద్ద బాణా సంచాలతో టపాసులు పేల్చి, రంగులు పూసుకొని ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఏలూరి శ్రీనివాసరావుతో పాటు పొట్టపెంజర రామయ్య, మూట గోపాల్, వెంకటనర్సమ్మ, నరేందర్, పద్దమళ్ళ సత్యనారాయణ, అక్తరున్నీసాబేగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

32 మంది మందుబాబులకు రూ. 67 వేల జరిమానా
* ట్రాఫిక్ ఏసీపీ జె సదానిరంజన్
ఖమ్మం(క్రైం), మార్చి 22: మద్యం సేవించి వాహనాలను నడిపితే వాహనచోదకులపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎసిపి సదానిరంజన్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందిని అధుపులోకి తీసుకొని జ్యుడిషియల్ పస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఉషశ్రీ ఎదుట హాజరుపరిచామని వెళ్ళడించారు. వారికి 67వేల 5వందల జరిమానా విధించారు.

‘గూడెం’లో భారీవర్షం.. స్తంభించిన జనజీవనం
కొత్తగూడెం, మార్చి 22: ఉదయంనుండి మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, టేకులపల్లి, పాల్వంచ మండలాల్లో వర్షం కురవగా పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి. అకాల వర్షం కారణంగా రైతులు ఆందోళనకు గురయ్యారు. మిర్చీ పంట కళ్లాల్లో ఉండటంతో మిర్చీ పంట తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సుజాతనగర్, చుంచుపల్లి, టేకులపల్లి మండలాల్లో మొక్క జొన్న పంట కాపుకు రావడంతో గాలి దుమారం రావడంతో పంట నేలమట్టం అయ్యింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని అండర్ బ్రిడ్జ్‌లోకి వరదనీరు రావడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క
ఖమ్మం (మామిళ్ళగూడెం), మార్చి 22: ప్రజా సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. గురువారం ఖమ్మంలోని ప్రజాభవన్‌లో మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. పంటలకు మద్దతుధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ నాయకులు ముందుండాలన్నారు. కాంగ్రెస్ ప్రజా సంఘాలు గ్రామాలలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ చింతకాని మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు కూరపాటి కిషోర్, బందెల నాగార్జున, కనె్నబోయిన గోపి, బొర్రా ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.