ఖమ్మం

వాహనంలో రూ.9 లక్షల నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం రూరల్, మార్చి 22: భద్రాచలం పోలీసులు ఎటువంటి ఆధారాలు లేకుండా వాహనంలో ఉన్న రూ.9 లక్షల నగదును, అలాగే 84 కేజీల వెండి వస్తువులు, బంగారుపూత పూసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారని ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ వెల్లడించారు. స్థానిక పట్టణ పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భద్రాచలం పట్టణ ఎస్సై మహేష్ గురువారం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా కారులో ఒక వ్యక్తి తిరుగుతున్నాడని, అతన్ని విచారించి వాహనాన్ని తనిఖీ చేయగా రూ.9 లక్షల నగదు లభ్యమైందన్నారు. నగదుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి అతను సందేహించడంతో అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. అలాగే భద్రాచలం ఆర్టీసీ ఇన్‌గేట్ వద్ద పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి వాహనాలు తనిఖీలు చేస్తుండగా గురువారం ఆర్టీసీ బస్సులో ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారని, వివరాలు ఆరా తీయగా వారు తీసుకొస్తున్న బ్యాగుల్లో భారీ ఎత్తున వెండి వస్తువులు ఉన్నాయని తెలిపారు. దాదాపు 84కేజీల వెండి వస్తువులతో పాటు బంగారుపూత పూసిన వస్తువులు ఉండటంతో పై ముగ్గురిని విచారించారని, వారు వివరాలు చెప్పకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఆయన విలేకర్లకు తెలిపారు. విలేకర్ల సమావేశంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై మహేష్, ట్రాఫిక్ ఎస్సై ఎస్డీ ఖాదర్‌బాబా, దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ పాల్గొన్నారు.

ఐటీసీ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం
ఖమ్మం(కల్చరల్), మార్చి 22: సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటుధర, దళారీ వ్యవస్థ రద్దు, ఐటీసీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఐటీసీ యాజమాన్యం రాతపూర్వక హామీనిచ్చి, అమలు విషయంలో దళారీలకు తలొగ్గి రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడడంపై తెలంగాణ సుబాబుల్, జామాయిల్ రైతులు దశలవారీ ఆందోళనలకు సిద్ధవౌతున్నట్లు సంఘం తీర్మానించింది. గురువారం స్థానిక సుందరయ్యభవన్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎకె రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ గత రెండు నెలలుగా జరిగిన పోరాటాలను, యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా సమీక్షించారు. రైతుల పోరాట ఫలితంగా యాజమాన్యం అనేక వాగ్దానాలు చేసినప్పటికిని కేవలం టన్ను 3 వేల లోపు అమ్మిన రైతులకు మిగిలిన డబ్బు చెల్లించే హామీ తప్ప దళారీ వ్యవస్థ రద్దు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసేలేదన్నారు. అందుకే రైతులంతా సంఘటితంగా దశలవారీ ఉద్యమం చేపట్టాలని వారు నిర్ణయించారు. దానిలో భాగంగా 23న నగరంలోని రాజకీయపార్టీల, రైతుసంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం, 25 నుండి రైతులు తమ పంటను నిరవధికంగా కటింగ్ బంద్ నిర్వహించి, ముఖ్యమైన కేంద్రాల్లో రైతుసదస్సులు నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దు ఎర్రుపాలెం మండలం నుండి ఐటిసి వరకు మహాపాదయాత్ర నిర్వహించి ఐటిసిని ముట్టడిచేయాలని సమావేశం నిర్ణయించింది. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి ఏనుగుల వెంకటరెడ్డి, గౌరవాధ్యక్షులు నర్సయ్య, అధికార ప్రతినిధి బొంతు రాంబాబు, నల్లమల వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, మందడపు నాగేశ్వరరావు, రాయల చంద్రశేఖర్, స్వర్ణ ప్రహ్లదరావు, తోట రాధాకృష్ణ, అడపా రామకోటయ్య, మాదినేని లక్ష్మి, చుంచు విజయ్, బొర్రా మురళి, పుసులూరి నరేందర్, తాళ్ళూరి జగదీష్, రోషిరెడ్డి, కర్రి కోటేశ్వరరావు, నాగయ్య, వీరయ్య, రాంబాబు పాల్గొన్నారు.