ఖమ్మం

కల్యాణ వేడుకలకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 22: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 26న జరిగే శ్రీ సీతారాముల కల్యాణ వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక ఉత్సవాలకు గురువారం అంకురార్పణ చేశారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర గోదావరి నది పుణ్యజలాన్ని కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి ఆలయం చుట్టూ పల్లకీ సేవ గావించి బేడా మండపంలో కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు స్వామివారికి వేదస్వస్తి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించారు. అనంతరం మూలమూర్తుల వద్ద కల్యాణోత్సవానికి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. బేడా మండపంలో స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, నారికేళ జలాలు, పండ్ల రసాలు, హరిద్రా చూర్ణాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వక్సేనులు, గరుత్మంతుడు తోడు రాగా ఊరేగింపుగా తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజ స్వామి ఆలయానికి వెళ్లి మృత్సం(పుట్టమన్ను)ను సేకరించి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయంలోని యాగశాలలో మృత్సంగ్రహణం, వాస్తు హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
రుత్వికులకు దీక్షా వస్త్రాలు
శ్రీరామనవమి కల్యాణోత్సవంలో పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చక స్వాములకు ఆలయ ఈవో ప్రభాకర శ్రీనివాస్ దీక్షా వస్త్రాలను అందజేశారు. పూజా కార్యక్రమాల్లో ఆధ్వర్యులుగా, బ్రహ్మగా, ఆచార్యులుగా, రుత్వికులుగా వ్యవహరించే అర్చకులతతో పాటు వేద పండితులకు, మేళతాళ వాయిద్యాల సిబ్బందికి సైతం దీక్షా వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం అర్చకులు ఈవోను ఆశీర్వదించారు. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక జీయర్‌మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖన పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు ధ్వజపట భద్రక మండల లేఖనం (గరుడ చిత్రం) వేయనున్నారు. సాయంత్రం గరుఢాదివాసం, రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.

ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ పెట్టడం దారుణం
* ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి
ఖమ్మం, మార్చి 22: రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి బహిష్కరించడం దారుణమని, అబద్ధాలతో కాలం గడుపుతున్న టీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమవుతుందన్నారు. నాడు అనేక హామీలనిచ్చి గద్దెనెక్కారని, అవి అమలు కాని హామీలని అప్పుడే చెప్పామని గుర్తుచేశారు. నాడు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఐదున్నర లక్షల ఇళ్ళు కట్టాల్సి ఉండగా కేవలం తొమ్మిదివేల ఇళ్ళు మాత్రమే కట్టారన్నారు. మన ఊరు - మన ప్రణాళిక, గ్రామజ్యోతి లాంటి పథకాలు ఎటుపోయాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రానికి అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల డిపిఆర్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ఉద్యోగాల విషయంలోనూ, రైతులను గిట్టుబాటు ధర విషయంలోనూ మోసంచేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. సమస్యల కోసం ప్రశ్నిస్తే నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నాడు ఉద్యమంలో తమతో పాటు పనిచేసిన వారందరిని ఇప్పుడు శత్రువులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ప్రశ్నిస్తుంటే దాని గురించి మాట్లాడకుండా సమితులు ఏర్పాటు చేశామని దాటవేయడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీల అమలు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, డబ్బులు దండుకునేందుకు ప్రాజెక్టుల ఆధునీకరణ పేరుతో చేస్తున్న ఖర్చుపై వివరిస్తున్నామన్నారు. తమను సభనుంచి సస్పెండ్ చేసినా తాముమాత్రం ప్రజా సమస్యలను ప్రజల వద్దకు వెళ్ళి వివరిస్తూ పోరాటానికి సన్నద్దం చేస్తున్నామన్నారు.