ఖమ్మం

రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు ఘనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మార్చి 24: ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోయిన తర్వాత జరిగే రెండవ ఏడాది రాములోరి కల్యాణానికి అధికారులు, అధికార ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం నగరంలోని వైరారోడ్‌లోని పర్ణశాల వద్ద జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి భారీగా చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. వారం రోజులుగా నిర్వరామంగా పందిళ్ళు, ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలంకరణలు, సీతమ్మవారు, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుని భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు, భద్రాచలం తరహాలో జానకి రాముల కల్యాణాన్ని నిర్వహించాలని, భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు ఘనంగా చేశారు. నగరం అంతటా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వేలాది మందికి తీర్థ ప్రసాదాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక కల్యాణం అనంతరం సాయంత్రం భారీ ఊరేగింపుతో శ్రీ సీతారాములు లకారం చెరువులో జరిగే తెప్పోత్సవానికి తరలిరానున్నారు. మేళతాళాలు, బాణసంచా, కళాకారుల విచిత్ర వేషధారణల నడుమ జానకి రాములను ఊరేగించనున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో జరగనున్న తెప్పోత్సవం
అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన లకారం ట్యాంక్‌బండ్‌లో భద్రాద్రి తరహాలో కనీవినీ ఎరుగని రీతిలో తెప్పొత్సవాన్ని ద్వితీయ సంవత్సరం నిర్వహించడానికి నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీ బోటును నాలుగు రోజుల క్రితమే తెప్పించి సుందరంగా అలంకరించారు. దీనిని తిలకించేందుకు నగర ప్రజలు భారీగా తరలివస్తున్నారు. 26న సాయంత్రం జరిగే తెప్పోత్సవంతో పాటు సినీ విభావరి ఉండడంతో భారీ బందోబస్తు చేపట్టారు.

గొర్రెల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలి
* జాయింట్ కలెక్టర్ రాంకిషన్
కొత్తగూడెం, మార్చి24: తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ తెలిపారు. శనివారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా యాదవ, కురుమగొల్ల ప్రాదమిక గొర్రెల పెంపకందార్ల సహాకార సంఘాల ప్రతినిధులకు అవగాహానా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లలో 135 సహాకార సంఘాలలో వున్న 12000 మంది సభ్యులలో 5524 మందికి గొర్రెలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన లబ్దిదారుల్లో 5234 మందికి గొర్రెలను పంపిణీ చేయటం జరిగిందని వివరించారు. జిల్లా పశుసంవర్దక శాఖా అధికారి డా వై వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన గొర్ల పెంపకంలో మెళకువలు పాటించి ఆర్థికంగా అభివృద్ది సాధించాలన్నారు. పశువులకు వచ్చే వాధులపై పెంపకందారులు అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాదమిక సహాకార సంఘం అద్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్, జిల్లా నోడల్ అధికారి డా వెంకయ్య, సహాయ సంచాలకులు వేణుగోపాలమూర్తి, సత్యప్రసాద్, వలీబాబా, ప్రదీప్, పశువైద్యాదికారులు డా రవీంద్రనాధ్‌ఠాగూర్, రవీందర్, రమేష్‌బాబు, నీలాకాంత్, విజయ్, శ్రవంతి, సంతోష్, రాజేష్, రవీందర్, యాదవ సంఘం నాయకులు మచ్చా శ్రీనివాసరావు, నాగసీతారాములు, దొడ్డాకుల రాజేశ్వరావు, అల్లాడి రంగయ్య, పరమేష్, బుచ్చయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సహస్ర గళార్చన
భద్రాచలం టౌన్, మార్చి 24: భద్రాద్రి భక్తరామదాసు కీర్తనలతో ఓలలాడింది. వెయ్యి గొంతుల నుంచి సుస్వరాల కీర్తనలు జాలువారాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహహ్ర గళార్చన కార్యక్రమం ఆద్యంతం వైభవంగా కొనసాగింది. తొలుత ఉత్సవమూర్తులకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నేతృత్వంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సహస్ర నామార్చలో పాల్గొని రామదాసు కీర్తనలను ఆలపించారు. కార్యక్రమంలో ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.