ఖమ్మం

బడ్జెట్‌పై వాడివేడి చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మార్చి 24: ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి కోసం 300 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరిగింది. కార్పొరేషన్ మీటింగ్ హాల్‌లో శనివారం నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అధ్యక్షతన 300 కోట్ల రూపాయల అంచనాతో 2018-19 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 98.85 కోట్ల ఆదాయం రాగా 93.76 కోట్లు వెచ్చించి 5.08 కోట్ల రూపాయలను మిగులు బడ్జెట్ చూపారు. నీటి సరఫరా, అభివృద్ధి, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, రిక్రియేషన్ సౌకర్యాలకు 34.23 కోట్ల నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు నగరంలో జరుగుతున్న అభివృద్ధి, చేపట్టిన పనులలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆరోపణలతో వాదోపవాదాలు జరిగాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కలుగజేసుకొని ఖమ్మం నగరాభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని సూచించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు బాలగంగాధర్ తిలక్, బిజి క్లైమెంట్, అప్రోజ్ సమీనా, వడ్డెబోయిన నర్సింహరావు మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులకే పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించి నిధులను సద్వినియోగం చేయాలన్నారు. భూమి కొనుగోలుకు చెందిన విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, స్వచ్ఛ్భారత్ కింద వెచ్చించిన నిధులపై స్పష్టత ఇవ్వాలని మేయర్‌ను ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో అధికార పక్ష సభ్యులు మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి ఇతర కార్పొరేషన్లు గమనించేలా సక్రమంగా జరుగుతుందని, ఎటువంటి అపోహలకు తావు లేకుండా నగరాభివృద్ధికి పాటుపడుతున్నామని చెబుతూ ఎదురు దాడికి దిగారు. కమిషనర్ విధానాలతో పౌర సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, ప్రతి చిన్న పనికి జీవో అంటూ కాలయాపన చేస్తున్నారని అధికార, ప్రతిపక్ష సభ్యులు కమిషనర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులు అనుసరిస్తున్న విధానాలతో తాము డివిజన్లలో తిరగలేకపోతున్నామని, ప్రధానంగా ఎల్‌ఆర్‌ఎస్, బిల్డింగ్ ఫర్మిషన్లు, జనన, మరణ ధృవపత్రాల జారీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పౌర సేవలకు సంబంధించి కౌన్సిల్ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని పనులను వేగవంతం చేయాలని కమిషనర్‌కు సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ బత్తుల మరళీ, కమిషనర్ సందీప్‌కుమార్‌ఝా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, మందడపు మనోహర్, దీపక్, నాగరాజు, అక్కమ్మ, లక్ష్మి, వసంత తదితరులు పాల్గొన్నారు.