ఖమ్మం

నూతన బస్టాండ్ పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), మార్చి 24: ఖమ్మంలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను వేగవంతం చేయాలని ఆ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం అసెంబ్లీ హాల్‌లో జరిగిన సమావేశంలో విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత ఖమ్మంలో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించనున్న బస్టాండ్ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదన్నారు. ప్రణాళిక ప్రకారం నిర్మించనున్న బస్టాండ్ ప్రజా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బస్టాండ్ పనులను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ 2017-18 సిఎం ఎస్యూరెన్స్ కింద 10కోట్లు కేటాయించారన్నారు. ఎనె్నస్పీ స్థలంలో నిర్మించనున్న బస్టాండ్ రాష్ట్రంలోనే కొత్త నాంది కావాలన్నారు. దీర్ఘకాలికంగా ఖమ్మంలో ఉన్న సమస్యను బస్టాండ్ నిర్మాణంతో తీరనుందన్నారు. అక్టోబర్ 16దసరా పండుగనాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించగా సంబంధించిన కాంట్రాక్టర్ పూర్తిచేస్తానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టీసి సిఇ భారతి, ఎస్‌ఇ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఉన్నారు.

మున్సిపాల్టీగా మధిర అప్‌గ్రేడ్
* విలీనం కానున్న దిడుగుపాడు
* విడిపోనున్న మడుపల్లి
మధిర, మార్చి 24: మధిర నగర పంచాయతీని మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 21 నగర పంచాయతీలను మున్సిపాల్టీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఖమ్మం జిల్లాలోని మధిరను 2013 మార్చి 27న నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు. మధిరతో పాటు మండలంలోని మడుపల్లి, ఇల్లెందులపాడు, అంబారుపేట గ్రామాలను విలీనం చేశారు. ప్రస్తుతం మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేసే క్రమంలో దిడుగుపాడు గ్రామ పంచాయతీని మధిర మున్సిపాల్టీలో విలీనం చేయడంతో పాటు, విలీన గ్రామంగా ఉన్న మడుపల్లిని మున్సిపాల్టీ నుండి తొలగించనున్నారు. నాలుగు సంవత్సరాల నుండి మడుపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని తిరిగి పంచాయతీగా మార్చాలని కోరుతూ ఉద్యమాలు చేస్తున్నారు. మడుపల్లి గ్రామ వాసుల కల నెరవేరుతండగా మధిరలో తమ గ్రామాన్ని విలీనం చేయవద్దంటూ దిడుగుపాడు గ్రామస్థులు చేసిన ఉద్యమాన్ని పట్టించుకోకుండా కలపడం చర్చనీయాంశంగా మారింది. దీంతో దిడుగుపాడు గ్రామస్థులు మరోసారి ఉద్యమాలకు సన్నద్ధవౌతున్నారు.

విఐపి విధానంలో మార్పు తీసుకురావాలి
* మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి
* అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 24: రాష్ట్రంలో చాలామంది విఐపిలు వారి స్వార్థం కోసం బుగ్గలు ఏర్పాటు చేసుకొని హారన్ కొడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పోలీస్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇచ్చిన వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఎస్కార్ట్ వ్యవస్థ మనకు మంచిదా, దీనివల్ల ఉపయోగం ఎమిటని ప్రశ్నించారు. దీనిపై హోం శాఖ మంత్రి, పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు హారన్ విధానాన్ని అణిచివేయాలన్నారు. ఏపి రైమ్స్, సిల్ఫుడ్ ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల జిల్లాలో ఉన్న సుబాబుల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటితో పాటు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడటంతో వాటిపై ఆధారపడి ఉన్న రైతులు, నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రంలో అనేక మంది హోంగార్డులకు విధులు కేటాయించకుండా నెలల తరబడి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలోని కానిస్టేబుళ్లు పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వెంటనే వారికి పదోన్నతులు కల్పించటంతో పాటు హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. కొత్తగా ఇచ్చిన కమిషనరేట్‌లలో జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి సారించాలని, కొత్తగా ఇచ్చిన జిల్లాల్లో కూడా అభివృద్ధితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. నగరాలలో అర్ధరాత్రి వరకు పబ్‌లు నడిపేందుకు అనుమతులు ఇచ్చి అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించటం సరైందా అని ప్రశ్నించారు.