ఖమ్మం

ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ప్లీనరీకి ముఖ్యమంత్రితో పాటు పార్టీ ప్రధాన నేతలంతా 26వ తేదీ సాయంత్రానికే ఖమ్మం చేరుకోనున్నారు. కాగా ఖమ్మం నగరంలో తొలిసారి జరుగుతున్న ప్లీనరీని విజయవంతం చేసేందుకు రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం నగరానికి చేరుకోనున్న నేతలకు మంచి ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేతలందరికి మంచి వసతితో పాటు 26వ తేదీ సాయంత్రం నుంచే విందు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఖమ్మంలో పార్టీకి సంబంధించిన పెద్ద కార్యక్రమం జరగకపోవడం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండో ప్లీనరీ ఖమ్మంలో జరుపుతుండడంతో గతంలో ఏప్పుడూ ఎక్కడా నిర్వహించని రీతిలో ప్లీనరీని విజయవంతం చేయాలని జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే గత 14 ప్లీనరీలకు భిన్నంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధుల సభ నిర్వహించేందుకోసం ప్రత్యేకంగా ప్రాంగణాన్ని వేసవి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. 8కమిటీలను వేసి కమిటీల ద్వారా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయటంలో విజయవంతమయ్యారు. మరో వైపు ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దటమే కాకుండా ప్రధాన రహదారుల వెంట భారీ ఫ్లెక్సీలు, తోరణాలను ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన ప్రధాన నేతలందరికి స్వాగతం చెప్తూ వీటిని ఏర్పాటు చేయటం గమనార్హం. 27వ తేదీ ఉదయం 9గంటలకే పిజి కళాశాల మైదానంలో ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అనంతరం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 10గంటలకు ప్లీనరికి హాజరుకానున్నారు. సాయంత్రం 5గంటల వరకు ప్లీనరి జరగనున్నది. మధ్యలో కేవలం గంట సేపు మాత్రం భోజన విరామాన్ని ప్రకటించారు. ప్లీనరిలో 15ప్రధాన అంశాలపై తీర్మానాలను చేయనున్నారు. సాయంత్రం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

గిరిజన ఆశ్రమాల్లో నకిలీ తెలుగు పండిట్లు
* ఇద్దరి తొలగింపు * మరొకరిపై విచారణ

భద్రాచలం, ఏప్రిల్ 25: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కొందరు నకిలీ తెలుగు పండిట్ సర్ట్ఫికేట్లతో ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుతో వాజేడు మండలం పేరూరు, అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల ఆశ్రమ పాఠశాలల తెలుగు పండిట్లు బాలు, రామారావులపై ఐటీడీఏ విచారణ చేపట్టగా వారివి నకిలీ సర్ట్ఫికేట్లు అని తేలింది. దీంతో వీరిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐటీడీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి వీరు ఎంఏ తెలుగు పండిట్ పూర్తి చేసినట్లుగా సర్ట్ఫికేట్లు సమర్పించారు. 2012 డిఎస్సీలో వీరు ఉద్యోగంలో చేరారు. 2012 ఆగస్టు 13న నియామకపు పత్రాలు ఐటీడీఏ ఇచ్చింది. వీరి నిర్వాకం బట్టబయలు కావడంతో మిగిలిన ఉపాధ్యాయుల్లో కూడా కలవరం మొదలైంది. వీరిద్దరిపై ఫిర్యాదు రావడంతో ఉస్మానియా యూనివర్శిటీకి ఐటీడీఏ లేఖ రాసింది. వీరి సర్ట్ఫికేట్లు అసలా? నకిలీయా? అని నివేదిక కోరింది. వీరు పాసైన తేదీ, పేరు అన్ని యూనివర్శిటీ రికార్డుల్లో తనిఖీ చేయగా అసలు వారు చదివిన దాఖలాలే లేవని నిర్ధారణ అయ్యింది. అసలు వారు తమ యూనివర్శిటీలోనే చదవలేదని అధికారులు పేర్కొనడంతో అవాక్కయిన ఐటీడీఏ వెంటనే బాలు, రామారావులను డిస్మిస్ చేశారు.
కోర్టుకెక్కిన వ్యవహారంతో కదలనున్న డొంక
నకిలీ తెలుగు పండిట్ల వ్యవహారం బట్టబయలు కావడంతో బాలు, రామారావులు స్పందించారు. తమవి నకిలీవని ఐటీడీఏ అధికారులు పేర్కొంటున్నారని, మరి తమలాగే అదే యూనివర్శిటీ సర్ట్ఫికేట్లు సమర్పించిన వారి సంగతేంటని ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. ములకలపల్లి మండలం కమలాపురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడి సర్ట్ఫికేట్‌పై కూడా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆ యూనివర్శిటీకి ఐటీడీఏ డిడి విభాగం అధికారులు లేఖ రాశారు. యూనివర్శిటీ విచారణ నివేదిక వస్తే దొంగ సర్ట్ఫికేట్ల డొంక కదలనుంది.
కోర్టును ఆశ్రయించిన బాలు, రామారావు
తమ తెలుగు పండిట్ పీజీ సర్ట్ఫికేట్లు నకిలీవని తమను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాలు, రామారావులు కోర్టును ఆశ్రయించారు. కనీసం విచారణ కూడా చేపట్టకుండా ఎలా తొలగించారనేది వారి వాదన. కోర్టు నోటీసులతో ఐటిడిఎ తమ వాదనలను కూడా విన్పించింది. యూనివర్శిటీనే సర్ట్ఫికేట్లు నకిలీవని తేల్చి చెప్పినందున ఉద్యోగం నుంచి తొలగించామని వివరణ ఇచ్చింది.