ఖమ్మం

విమానాశ్రయ ఏర్పాటుపై తిరుగుబాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 19: ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా పునుకుడుచెలక తదితర గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే విధంగా నిర్మించాలని చూస్తున్న విమానాశ్రయ ఏర్పాటుపై తిరుగుబాటు చేయండని ఆదివాసీల పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు అన్నారు. విమానాశ్రయ ఏర్పాటుపై మండల పరిధిలోని పునుకుడుచెలక గ్రామంలో సిపిఎం బృందం మంగళవారం పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంది. తమకు విమానాశ్రయం అవసరంలేదని తాత, తండ్రుల నాటి నుండి వందసంవత్సరాలకు పైగా నివసిస్తూ సేద్యం చేసుకుంటున్న తమ భూములే తమకు కావాలని అక్కడి ఆదివాసీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న స్థలాన్ని ప్రతినిథి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని గ్రామప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలోని చట్టాలు గిరిజనులకు రక్షణగా ఉన్నాయని అన్నారు. 1/70, పీసా చట్టాలు గిరిజనులకు ఎంతో అండఅని, గ్రామసభలు నిర్వహించి ప్రజలు అంగీకరిస్తేనే ఎక్కడైనా ఏ అభివృద్ధి పని అయినా నిర్వహించాల్సి వుంటుందని తెలిపారు. గతంలో జరిగిన అభివృద్ధి పనుల సందర్భంగా కోల్పోయిన భూమికి వేరోచోట భూమి ఇస్తామని పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలు ఎక్కడా నెరవేరలేదని విమర్శించారు. సేద్యం చేసుకోవడానికి పేద ఆదివాసీలకు భూమి పంపిణీ చేయాల్సిన ప్రభుత్వమే ఉన్న భూముల నుండి వెల్లగొట్టే ప్రయత్నం చేయడం హేయకరమన్నారు. భూములను కాపాడుకునేందుకు పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాలులేని చోట విమానాశ్రయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఆదివాసీల వాణిని ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వినిపిస్తామని అన్నారు. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్టం సిపిఎం పోరాట ఫలితంగానే వచ్చిందన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య కూడా ప్రసంగించిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య, గుగులోత్ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, ఎం జ్యోతి, డివిజన్, స్థానిక నాయకులు ఇట్టి వెంకట్రావ్, కున్సోత్ ధర్మ, భూక్య రమేష్, దొడ్డా రవికుమార్, జాటోత్ కృష్ణ, ఎంపిటిసి కోబల్, సూర్య, రమేష్‌కుమార్ మక్కడ్, జలాల్, సోమలింగం, మేరుగు ముత్తయ్య, లావూడ్యా సత్యనారాయణ, వీరభద్రం, తుడుందెబ్బ నాయకులు పోతయ్య, స్థానిక వార్డుసభ్యురాలు కారం కాంతమ్మలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి
*మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు
ముదిగొండ, జనవరి 19: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్వ వైభవంగా తెచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన ముదిగొండ నవతేజ ఫంక్షన్ హాలులో అన్ని గ్రామ కమిటీల, మండల శాఖల ప్లీనరి సమావేశం జరిగింది. ముదిగొండ మండలాధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోకుండ పదవుల కోసం నాయకులను ఆకర్షిస్తుందన్నారు. వెళ్ళిన వారంతా పదవుల కోసం వెళ్ళిన వారేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే లక్ష్యంతో గ్రామాల్లో వివిధ శాఖలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ శాఖల స్పూర్తితో ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులపై టిఆర్‌ఎస్ ఆకృత్యాలను అరికట్టేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధానమంత్రి మోడీ గుజరాత్‌లో కూడా అధిక పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందన్నారన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిబద్ధతతో పని చేసి రానున్న కాలంలో 80వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో జిల్లా కేంద్రమైన ఖమ్మంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే అందరు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మాజీ జిల్లా అధ్యక్షుడు సోమ్లా నాయక్, రాష్ట్ర గ్రానైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, ఎంపిపి పసుపులేటి లక్ష్మి, జడ్పీటిసి మందరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ లీవ్‌గా సకలజనుల సమ్మెకాలం
కొత్తగూడెం, జనవరి 19: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సకలజనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్న విషయం విదితమే. తెలంగాణ అవిర్భావం నుండి సకలజనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించాలని డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి డివిడెండ్‌చెక్కును అందజేసిన సందర్భంలో సకలజనుల సమ్మె కాలంపై కార్మికులకు మేలు కలిగేవిధంగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభ్యర్ధించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని, ముఖ్యంగా సకలజనుల సమ్మెలో కార్మికులంతా పాల్గొనడంతో ఉద్యమం బలోపేతమైందని గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం అధికారులకు, ఉద్యోగులకు సకలజనుల సమ్మెకాలాన్ని స్పెషల్ లీవ్‌గా ప్రకటించిన విధంగానే సింగరేణి కార్మికులకు కూడా ఆ కాలానికి స్పెషల్‌లీవ్ మంజూరుచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనిపై సింగరేణి యాజమాన్యం వెంటనే చర్చించి విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రికి సింగరేణి సిఎండి ధన్యవాదాలు
సకలజనుల సమ్మె కాలంపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్మెకాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించినందున దీనిపై సాధ్యమైనంత తొందరలో బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో అంగీకారం పొంది వెంటనే ఉత్తర్వులు జారీచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలు ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించి బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా ప్రతి సింగరేణీయుడు తన బాధ్యతను నిర్వర్తించాలని సిఎండి శ్రీ్ధర్ పిలుపునిచ్చారు.

రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ఎర్రుపాలెం, జనవరి 19: రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అయ్యవారిగూడెంలో ఎంపి నిధులు 3లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సిసి రోడ్డుకు, రాజులదేవరపాడులో గ్రామ పంచాయతీ నిధుల నుండి నిర్మించే సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజులదేవరపాడులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ప్రతి ఒక్క పేదవానికి నిర్మించాలన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తే ఏ ఒక్కరికి ప్రయోజనం చేకూరదన్నారు. ఇప్పటి వరకు హామీలతోనే కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు కట్టిన ఇండ్ల సంఖ్య ఎక్కువన్నారు. తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి మంజూరు చేయడంలో వివక్ష చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందజేయాలన్నారు. ప్రభుత్వానికి గుణపాటం చెప్పేరోజులు దెగ్గరలోనే ఉన్నాయన్నారు. మండలంలోని బీమవరం గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ సమస్యపై సబ్ స్టేషన్‌కి వెళితే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. అలాగే రైల్వే మంత్రికి కొవ్వూరు, భద్రాచలం రైల్‌మార్గం గురించి ఎన్నోసార్లు విన్నవించడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. వెనుకబడ్డ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రధాన బహుమతి పొందిన నారాబత్తుల జ్యోష్నను ఆయన సత్కారం చేశారు. గ్రామంలోని 200మంది పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి లింగాల కమల్‌రాజ్, జడ్పీటిసి అంకశాల శ్రీనివాసరావు, సర్పంచ్ గూడూరు రమణారెడ్డి, కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, గుర్రాల పుల్లారెడ్డి, బండారు వెంకటనర్సమ్మ, ఎంపిటిసిలు అంకమ్మ, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తిచేయాలి
* న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి పోటు రంగారావు
ఖమ్మం(ఖిల్లా), జనవరి 19: జిల్లాకు సాగునీటిని అందించే దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వాల మాదిరిగా కాలయాపన చేయకుండా రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. మంగళవారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, రాజకీయపక్షాలు ఎన్నో దశాబ్ధాలు చేసిన పోరాటం, ఆందోళన ఫలితంగానే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నిర్మాణమని పేర్కొన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌ను స్వాగతిస్తూ జిల్లా ప్రజలకు నీరందించేందుకు ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్ట్‌కి అవసరమైన 7500కోట్ల నిధులను రానున్న రెండు వార్షిక బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల గడువు పెట్టడం సరైంది కాదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలోనే రెండు బడ్జెట్‌లలో పూర్తినిధులు కేటాయించి పూర్తిచేయాలన్నారు. అదే విధంగా దుమ్ముగూడెంను తులారం ప్రాజెక్ట్‌కు, పాలేరుకు అనుసంధానం చేయాలన్నారు. చిన్న నీటిపారుదల ప్రాజెక్టులైన మొండికుంట, పాలెంవాగు, తాలిపేరు ప్రాజెక్ట్, కినె్నరసాని, మునే్నరు, శ్రీరాంసాగర్-2వ దశకు తగినన్ని నిధులు కేటాయించి పూర్తిచేయాలన్నారు. బయ్యారం, పెద్దవాగు, మూకమామిడి, వైరా వంటి పెద్ద చెరువుల పూడికలను తీయడంతో పాటు అస్తవ్యస్తంగా నీరందించే విధానాన్ని అధిగమించేందుకు కాల్వల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

బంగారు తెలంగాణే
టిఆర్‌ఎస్ ధ్యేయం
వైరా, జనవరి 19: బంగారు తెలంగాణే ధ్యేయంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు ఇరుపార్శపు భాస్కర్ అన్నారు. మంగళవారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశలో అభివృద్ధి చేసేందుకు భాగంగానే కాకతీయ మిషన్ పేరుతో కోట్లాది రూపాయలతో చెరువుల పూడికతీత పనులు చేసి ఇప్పటికే తెలంగాణ చెరువుల పునరుద్దరణ జరిగిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే జిల్లాలో గోదావరి నదిపై దుమ్ముగూడెం టెయిల్‌పాంట్ ప్రాజెక్టు నిర్మాణం జరిపి జిల్లాను సస్యశామలం చేసే ఉద్దేశంతోనే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు కృషిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వైరా నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ఇందులలోభాగంగానే కార్యకర్తలు ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రి తుమ్మలకు, ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈసమావేశంలో నాగకోటేశ్వరావు, తన్నీరు నాగేశ్వరావు, షేక్ లాల్‌అహ్మద్, పారుపల్లి నాగేశ్వరావు, శాకముడి లోకేశ్వరావు, ప్రమోదు, దొంతెబోయిన వెంకటనారాయణ, తిరుపతిరావు పాల్గొన్నారు.

విమానాశ్రయం నిర్మాణానికి వైకాపా వ్యతిరేకం కాదు
కొత్తగూడెం, జనవరి 19: కొత్తగూడెం మండలంలో విమానాశ్రయం నిర్మాణానికి వైకాపా వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగాచార్యులు అన్నారు. స్థానిక ఎంపి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు కందుల సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం వలన నిర్వాసితులు అవుతున్న ఆదివాసీలకు తగిన పునరావాసం, ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని కోరారు. ఆదివాసీ కుటుంబాలకు పట్టా పాసుపుస్తకాలు చూపించాలనే నిబంధనలను విధించకుండా ఎకరానికి రూ 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విమానాశ్రయం వలన నష్టపోతున్న ఆరుగ్రామాల ప్రజలకు సమీపంలోనే పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలని అన్నారు. నిరాశ్రయులౌతున్న 600 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను విమానాశ్రయంలోనే కల్పించాలని డిమాండ్ చేశారు. మైలారం గ్రామపంచాయితీలో ఉన్న రాగి, కంచు తదితర ఖనిజ సంపదను కాపాడాలని అభయారణ్యంలో ఉన్న జీవకోటికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా, స్థానిక నాయకులు చిలక రాములు, పులి రాబర్టు రామస్వామి, జక్కుల సత్యనారాయణ, బిరుదురాజు సుబ్బరాజు, కట్టా నాగమణి, వంగూరి రేణుక, బి రాణి, సంబ శంకర్, తాజుద్దీన్, మందా మల్లేష్, రాంబాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయ నిర్మాణం వలన ఆదివాసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు.

మోదీ పాలనలో కార్మిక, కర్షకుల భవితకు భరోసా లేదు
ఖమ్మం(కల్చరల్), జనవరి 19: మోదీ పాలనలో కార్మిక, కర్షకుల భవితకు భరోసా లేకుండా పోయిందని ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్ధానిక ఎన్‌ఎస్‌పి క్యాంపులోని ప్రజాసంఘాల కార్యాలయంలో తెలంగాణ రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మాట్లాడారు. దేశంలో 9600 ఫ్యాక్టరీల్లో 6.5 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. దేశానికి ఆదాయం వచ్చే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టి కార్మిక వ్యవస్ధను నిర్వీరియం చేయాలను కోవడం దారుణమన్నారు. ఇప్పటికే ఓఎన్‌జిసి, రక్షణశాఖ, గ్యాస్, స్టీల్ అధారిటి వంటి 15 సంస్ధల వాటాలను విదేశీ సంస్ధలకు కట్టబెట్టిందన్నారు. ఇలాంటి చర్యలు తక్షణమే మానుకోవాలని ఆయన ప్రభుత్వాలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఊదరగొటి ప్రస్తుతం వాటి గురించే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉపాధి హామీ కింద ప్రభుత్వాలు పని గంటలను 48 లక్షల గంటలకు కుదించడం దారుణమన్నారు. గ్రామాల్లో కరువు పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో 13.50 లక్షల మంది పట్టణాలకు, అరబ్ దేశాలకు వలస వెళ్ళారన్నారు. వలసలు, రైతు ఆత్మహత్యలు ఆగాలంటే పెండింగ్ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేసి కొత్తరుణాలను మంజూరి చేయాలన్నారు.రైతు సంఘం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేఙ, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె నరసింహారావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, బి మధు తదితరులు పాల్గొన్నారు.