ఖమ్మం

తుమ్మల గెలుపు జిల్లా అభివృద్ధికి మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండ్రుగొండ, ఏప్రిల్ 26: పాలేరు ఉప ఎన్నికలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు తధ్యమని తుమ్మల గెలుపుతో జిల్లా సర్వతో ముఖాభివృధి సాదిస్తుందని అశ్వారావుపేట ఎమ్యెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గుర్రాయిగూడెం గ్రామంలో వివాహవేడుకలో పాల్గొన్న ఎమ్యెల్యే అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జిల్లా అభివృధ్ధికి నోసుకోలేదని ,తిరిగి తుమ్మల మంత్రి అయిన తరువాతే అన్ని రంగాలలో అభివృధ్దివైపు పయనిస్తుందని ఎమ్యెల్యే తెలిపారు. తన నియోజకవర్గంలో రోడ్లు,, మిషన్‌భగీరధ, మిషన్‌కాకతీయతో పాటు తదితర శాఖల ద్వార రూ 500 వందల కోట్లకు పైగా అభివృధ్ది పనులు జరుగుతున్నట్లు తెలిపారు.కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 35సంవత్సరాలుగా ప్రజలుకోసం పోరాడిన తుమ్మల మారిన రాజకీయ పరిస్తితుల నేపద్యంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ తరుపున పోటి చేస్తుంటే తుమ్మలను ఓడించేందుకు కాంగ్రెస్ ను బద్దశత్రువుగా చెపుకొనే టిడిపితో చేతులు కలపటం దివాళ కోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎంతమంది ఏకమైయిన మంత్రి తుమ్మల భారీమెజార్టీతో గెలవటం ఖాయమన్నారు. అదేవిదంగా బుధవారం ఖమ్మంలో జరిగే పార్టీ ప్లీనరీ మహాసభకు మండలంనుండి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరిలిరావాలని ఎమ్యెల్యే తాటి పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపి గుగులోత్ బాలునాయక్, సీనియర్ నాయకులు తాళ్ళూరి వెంకటేశ్వరరావు, సనే్నపల్లి నాగేశ్వరరావు, మాళోత్ భోజ్జానాయక్, మేడా మెహన్‌రావు, సూరా వెంకటేశ్వర్లు, గాదె లింగయ్య తదితరులు పాల్గొన్నారు.