ఖమ్మం

ఐటీడీఏలో కొలువు భలే..్భలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 26: ఐటీడీఏ అంటే ఉద్యోగులకు అత్తారింటిలా భావిస్తున్నారు. అల్లుళ్లలా వ్యవహరిస్తున్నారు. అసలు అధికారే లేని శాఖలో పనిచేసేందుకు డిప్యూటేషన్లపై వచ్చేందుకు ఉద్యోగులు పోటీపడుతున్నారు. అంతేకాదండోయ్... ఉన్న ఒక్క అటెండర్ పోస్టుకు ఇద్దరు డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తుండటం గమనార్హం. ఇదేదో చదవడానికి వింతగా ఉంది కదా..? నిజమే. గిరిజనం సాక్షిగా ఐటీడీఏలో ప్రస్తుతం జరుగుతున్నదిదే. భద్రాచలం మన్యానికి ప్రధాన ఇరుసుగా భావించే ఏజెన్సీ విద్యాశాఖాధికారి కార్యాలయంలోనే ఈ తంతు కొనసాగుతోంది.
ఏజెన్సీ డిఈఓ కార్యాలయం అలంకార ప్రాయం
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 70కు పైగా ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఉన్నాయి. 40వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలను పర్యవేక్షిస్తూ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల చదువును పరిశీలించాల్సిన శాఖ ఏజెన్సీ డీఈఓ కార్యాలయం. ఇది భద్రాచలం ఐటీడీఏలో అలంకారప్రాయంగా మారింది. ఎందుకంటే 2014 డిసెంబర్ నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. గిరిపుత్రులకు విద్యాగంధాన్ని అంటించేందుకు ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ఈ శాఖను ఏర్పాటు చేసింది. కానీ ఆ శాఖకు అధికారినే ఇవ్వడం లేదు. ఈ కార్యాలయంలో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టు 11.06.2012 నుంచి, ఆఫీస్ సబార్డినెంట్ పోస్టు 1.8.2014 నుంచి, స్టెనో పోస్టు 1992 నుంచి ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం కార్యాలయం సూపరింటెండెంట్, రికార్డు అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో మాత్రమే సిబ్బంది పనిచేస్తున్నారు.
అటెండర్ పోస్టు ఒకటి ఖాళీ
ఏజెన్సీ విద్యాశాఖాధికారి పోస్టు 2014 నుంచి ఖాళీగా ఉంది. అధికారే లేనపుడు అటెండర్‌తో పనేముంటుంది. కానీ ఈ ఒక్క అటెండర్ పోస్టు కోసం ఇద్దరు డిప్యుటేషన్‌పై వచ్చారు. వీరిద్దరూ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే వారే. ఒక్క అటెండర్ పోస్టులో ఇద్దరు డిప్యుటేషన్‌పై పనిచేస్తునప్పటికీ అధికారులు చలించడం లేదు. అసలు పనేలేని శాఖకు వీరి అవసరమేమిటి? అన్న ఆలోచనే వారిలో కలగడం లేదు. ప్రభుత్వ సొమ్మును అక్షరాలా నెలకు రూ.2లక్షలు చొప్పున ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తింటూ పనీపాటా లేకుండా తిరుగుతున్నారు అంటే అతిశయోక్తి కానే కాదు.
వాస్తవమే..
ఇదే విషయాన్ని ఏజెన్సీ డీఈఓ కార్యాలయం సూపరింటెండెంట్‌ను ఆంధ్రభూమి వివరణ కోరగా...కార్యాలయంలో పోస్టులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అటెండర్ పోస్టులో ఇద్దరు పనిచేస్తున్నది కూడా నిజమేనన్నారు.