ఖమ్మం

ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒక్కరోజు అధికారులు నిజాయతీగా పనిచేస్తే కోటి రూపాయల ఆదాయం
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా పాలన కొనసాగుతుందని జిల్లా పరిషత్ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మిషన్ భగీరథ, విద్య, గనులు భూగర్భశాఖలపై అధికారులతో సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గనులు భూగర్భశాఖ ఏడి లక్ష్మీప్రసాద్ నివేదిక సమర్పించారు. ఈ సమయంలో ముల్కలపల్లి జడ్పీటీసి బత్తుల అంజి మాట్లాడుతూ 3సంవత్సరాలుగా ఇవే సర్వసభ్య సమావేశాల్లో ఇసుక మాఫియాను అరికట్టాలని విన్నవించినప్పటికి అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ముల్కలపల్లి పరిధిలో 5 ఇసుక ర్యాంపులుండగా 15ర్యాంపులు నడుపుతున్నారని కోట్లాది రూపాలను ఇసుక మాఫియ దండుకుంటుండగా అధికారులు చోద్యం చూస్తున్నారని, పంచాయతీ కార్యదర్శులు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో తాను ఆర్టీఐ యాక్టుద్వారా సేకరించిన సమాచారంలోరూ. 3కోట్ల 21లక్షల మేరకు లూటీ జరిగిందన్నారు. గురువారం సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేసి అసలు దోషులైన తహసీల్దార్‌లు, యూడీసీలను ఎందుకు వదిలేశారన్నారు. ఇసుక మాఫియాపై రాజీ పడేదిలేదని ప్రతి సమావేశంలో అనే అధికారులు మిన్నకుండిపోవడంతో తాను సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. 130కిలోమీటర్ల నుండి సమావేశంలో పెట్టే భోజనంకోసం తాను రావడంలేదని తన పరిధిలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని వీధిలైట్లు వెలగాలని ప్రజాప్రతినిధులను దృష్టిలో ఉంచుకొని తాను ఈ సమస్యలను లేవనెత్తానన్నారు. బత్తుల అంజికు అండగా నిలిచిన సభ్యులు జియాఉద్దీన్, వౌలానా, చండ్ర అరుణ, పరంజ్యోతి, లక్కినేని సుధీర్‌లు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక ఆదాయంలో లక్షలు ప్రభుత్వానికి, కోట్లు అధికారులు, ఇసుక మాఫియా కొల్లగొడుతున్నారన్నారు. ఏడి లక్ష్మీ ప్రసాద్, డిపివో ఆశాలతలు వివరణ ఇస్తూ ఇసుకకు మాకు ఎలాంటి సంబందంలేదన్నారు. దీంతో బత్తుల అంజి తీవ్రంగా స్పందించి కొత్తగూడెం జెసిని నిలదీశారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో మూడు శాఖలకు బాధ్యత వుందన్నారు. సభ్యులు జియా ఉద్దీన్ వౌలానా, లక్కినేని సుధీర్, అరుణలు మాట్లాడుతూ అధికారులు ఒక్కరోజు తమతో కలిసి నిజాయితీగా పనిచేస్తే ఇసుక విషయంలో కోటి రూపాయల ఆదాయాన్ని చూపిస్తామన్నారు. వందలాది లారీలకు వే బిల్లులు లేకుండా తరలిపోతున్నాయని ఒకే గంటలో 7 ఇసుక లారీలు దొరికాయని చర్ల ఎంపీపీ కోదండ రామయ్య ఆరోపించారు. బత్తుల అంజి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటారా లేక నన్ను సమావేశానికి రావద్దంటారా చెప్పాలని నిలదీయగా భద్రాద్రి కొత్తగూడెం జెసి రాంకిషన్ స్పందించి 15రోజుల్లో సంబందిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. తొలుత జరిగిన మిషన్ భగీరధ సమీక్షలో వేసవిలో తాగునీరు అందించక పోవడంపై సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, సిఈవో మారుపాక నగేష్, మహబూబాబాద్ జెసి దామోదర్‌రెడ్డి, నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.