ఖమ్మం

బస్సు యాత్రతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, ఏప్రిల్ 20 : వ్యవసాయం దండగ అన్న ప్రతిప్రక్షాలు బస్సు యాత్రతో ప్రజలను, రైతులను గందరగోళం చేస్తున్నారని ఐడీసి చైర్మన్ బుడాన్ బేగ్ విమర్శించారు. శుక్రవారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ఐడీసి చైర్మన్ బుడాన్ బేగ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్దితి చాల దారుణంగా ఉండని అధికార పక్షం టిఆర్‌ఎస్ రైతుల పట్ల ఉంటు వారిని అన్ని విధాలుగా అదుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 60 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం వ్యవసాయం దండగా అంటున్న సమయంలో వ్యవసాయంను దండగ కాదు పండుగ అంటు రైతులు అన్ని రకాలుగా అదుకుంటు ముందుకుపోతున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ మాత్రమేన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం రైతులను, కార్మికులను, చేతి వృత్తులను, కుల వృత్తులను అన్ని వర్గాలను అదుకుంటు బంగారు తెలంగాణాగా మారుస్తూన్నారన్నారు. రైతు బాగుండాలంటే రైతులకు కావాలసిన సాగునీటి, విద్యుత్‌ను, విత్తనాలను, ఎరువులను సకాలంలో అందించటంమే లక్ష్యంగా పెటుకున్నారన్నారు. వీటితో పాటు పండిన పంటకు మద్దతు ధరను ప్రకటించి వాటిని అమ్ముకోవాటనికి గాను ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాభాసాటి వ్యాపారంగా వ్యవసాయంను మార్చిందుకు గాను రైతులకు కావాలసిన వసతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిపిస్తున్నట్లు తెలిపారు. డిసిసిబి చైర్మన్ మువ్వ విజయబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 1లక్ష50వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను రైతులు పండించారని వాటిలో వరంగల్ జిల్లా ప్రధమస్ధానం సాధించగా రెండో స్ధానం ఖమ్మం జిల్లా సాధించినట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో మొక్కజొన్న, వరి పంటలు అధికంగా పండిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమస్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ నిధి కార్యదర్శి సామినేని వెంకటేశ్వరావు, నేలకొండపల్లి ఎఎంసి చైర్మన్ శాఖమూరి రమేష్, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, పోట్ల ప్రసాద్, వెంకటరెడ్డి, రవి, తహశీల్ధార్ దొడ్డారపు సైదులు, ఎపిడివో పురుషోత్తం, యడవల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

మండుతున్న ఎండలు
* నిర్మానుష్యంగా రహదారులు
* ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి
జూలూరుపాడు, ఏప్రిల్ 20: గత వారం రోజులుగా మండుతున్న ఎండలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. పొద్దుపొడుస్తుందంటే చాలు సూర్యభగవానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణికార్తెను మరిపిస్తున్న ఎండవేడిమి కారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రత తీవ్రరూపం దాల్చింది. పగటి సమయంలో ఆరుబయటకు రావాలంటే జనం భయపడుతున్న పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారితోపాటు పాపకొల్లు, బేతాళపాడు, కాకర్ల, అనంతారం వైపు వెళ్లే రహదారులు, అంతర్గత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండే ఎండను చూసి జనం ఇళ్లలో నుంచి బయటకు రావటంలేదు. వృద్దులు, చిన్నారులు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఆనారోగ్యంపాలై ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఎండతోపాటు ఉక్కపోత తోడవటంతో ప్రజలు ఇళ్లలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాలను విరివిగా వాడుతుండటంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ పెరిగింది. నాలుగు రోజులుగా వివాహాది శుభకార్యక్రమాలు అధికంగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ప్రజల రాకపోకలు అధికమవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు చాలా మంది మండల కేంద్రంలోని శీతలపానీయాల దుకాణాల వద్ద గుమికూడుతున్నారు. మండల కేంద్రంలో సమాజసేవలో భాగంగా పోలీసుశాఖ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజల దాహార్తిని తీర్చుతోంది. చలివేంద్రంలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి మండుతున్న ఎండలో వచ్చే ప్రయాణికులకు చల్లని మంచినీళ్లను అందిస్తున్నారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బస్‌షెల్టర్‌ను తొలగించటంతో ఎండలో సేదతీరేందుకు ప్రయాణికులకు నీడ కరువై ఇబ్బందిపడుతున్నారు. వేసవికాలం ప్రారంభం నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.