ఖమ్మం

మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, ఏప్రిల్ 22: 13సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెంలో 25లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటి హాల్ భవనానికి శంకుస్థాపన, పిండిప్రోలులో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు, గ్రామ పంచాయతీ నిర్మాణానికి, సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైస్కూల్లో తాతా మధు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పాలేరు ప్రజలు తనను గెలిపించారని, వారి రుణం తీర్చుకునేందుకు జీవితాంతం రుణపడి ఉంటానని, నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ వ్యక్తి నిరుత్సాహ పడవద్దని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, రైతులు పంటలు పండి ఆనందంతో ఉండటమే తన ఆశయమన్నారు. కరువు కొరల్లో అల్లాడుతున్న తిరుమలాయపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాల భూమిని సాగులోకి వచ్చిందని, శ్రీరాంసాగర్ కాల్వలను తవ్వి కాల్వల ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా కాల్వలు తీర్చిదిద్దాలని, వేసవిలో పిల్ల కాల్వలను పూర్తి చేయాలన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి చేశారని, జరిగిన అభివృద్థి గురించి దేశంమొత్తం చర్చించుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను స్వాగతించాలని ఆయన కోరారు. కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జింకలగూడెంకు చెందిన షమీనాకు తుమ్మల తన తరపున లక్ష రూపాయలను, ఎంపి పొంగులేటి తరపున మరో లక్షను ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్థి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఐడిసి చైర్మన్ బేగ్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, సిఇఓ నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, ఎంపిపి కొప్పుల అశోక్, సర్పంచ్ అంగడి వీరస్వామి, ఎంపిటిసి సురేంద్రనాద్ తదితరులు పాల్గొనగా తుమ్మల సమక్షంలో పలువురు టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారందరికి తుమ్మల కండువా కప్పి సాదనంగా ఆహ్వానించారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.