ఖమ్మం

కొత్త పార్టీల ప్రభావమెంత..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ జన సమితి, జనసేన పార్టీలు ఎంత మేరకు ప్రభావితం చూపుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో వివిధ రాజకీయ, ప్రజా, ఉద్యోగ సంఘాల సమ్మిళితంగా ఏర్పాటైన టీజేఏసీ తన రూపు మార్చుకుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా టీజేఏసీ పేరిట కార్యకలాపాలు నిర్వహించినా ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఇటీవలే ‘తెలంగాణ జన సమితి’ పురుడు పోసుకుంది. ఇక సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తోంది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? ఎవరితోనైనా పొత్తుతో ముందుకు సాగుతుందా అనే దానిపై స్పష్టత లేకున్నా పవన్‌కళ్యాణ్ గత రెండు నెలల క్రితం జిల్లాలో పర్యటించినప్పుడు యువత నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే సాధారణ ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉన్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన జనసమితి, జనసేన పార్టీలు జిల్లా రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతాయనే చర్చ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈనెల 29న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు జన సమీకరణపై టీజేఏసీ నేతలు దృష్టి సారించారు. అదే సమయంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మంతనాలు సాగిస్తున్నారు.
రాజకీయ పరిస్థితులపై ఆరా
రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేస్తోంది. నియోజకవర్గాల వారీగా వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు, నాయకులు, గ్రూపులు తదితర కోణాల్లో అంతర్గత నివేదికలు సిద్ధం చేస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తివాదులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి టీఆర్‌ఎస్‌లో రాజకీయ అవకాశాలు దక్కనివారు.. తదితరుల గురించి తెలంగాణ జన సమితి వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఓ వైపు వివిధ పార్టీల నేతలను ఆకట్టుకోవడంపై దృష్టి సారిస్తూనే ఇన్నాళ్లూ టీజేఏసీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారి శక్తి సామర్థ్యాలను కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థి సంఘాల నేతలు, వివిధ రంగాలకు చెందిన వారిని సాధ్యమైన చోట సాధారణ ఎన్నికల బరిలో నిలపాలనే యోచనలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావ సభ తర్వాత చేరికలు ఉంటాయని టీజేఏసీ నేతలు చెబుతున్నారు. రైతు, యువతకు సంబంధించిన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ వాదం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లేలా ఆ పార్టీ కార్యాచరణ రూపొందించుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొనసాగుతున్న వివక్ష, అపరిష్కృత డిమాండ్లు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మరుగున పడిన ఈరు, ఉద్యమ ఆకాంక్షలను గుర్తించడంలో టీఆర్‌ఎస్ వైఫల్యం, తెలంగాణ వాదులపై ప్రభుత్వ అణచివేత తదితరాలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
యువతపై జనసేన దృష్టి
సినీ నటుడు పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత రెండు నెలల క్రితం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో పార్టీలకు అతీతంగా వివిధ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. అయితే నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఆ పార్టీకి చెప్పుకోదగిన నాయకుడు లేరు. తెలంగాణలో జనసేన పోటీపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో రాజకీయంగా జిల్లాలో ఎదుగుదలపై నాయకులు ఆలోచన చేస్తున్నారు. కాగా జనసేన పార్టీ ముఖ్యంగా యువతనే నమ్ముకుంటోంది. పవన్‌కు యువతలో మంచి ఇమేజ్ ఉండటంతో ముఖ్యంగా వారికి సన్నిహితం కావాలనేది జనసేన వ్యూహాంగా కనిపిస్తోంది. జనసేనలో ప్రస్తుతం ఉన్నవారికి ఎక్కువగా రాజకీయ అనుభవం లేకపోవడం జనసేన పురోగతికి ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ నిలదొక్కుకుంటున్న సమయంలో జనసేన పోటీ చేస్తే ఓట్లను చీల్చే వీలుందని, తద్వారా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటికంటే ముందు తెలంగాణలో అసలు జనసేన వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప జిల్లాలో జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది.