ఖమ్మం

టీటీడీ సభ్యునిగా ఎన్నిక కావటం గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎన్నిక కావటం ఇరు జిల్లాలకు గర్వకారణమని ఖమ్మం టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి సుమంత్, పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. టిటిడి సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం సండ్ర క్యాంపు కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుమంత్, పార్టీ నాయకులు మాట్లాడుతూ సండ్ర వెంకటవీరయ్యను 3వ సారి టిటిడి పాలక మండలి సభ్యునిగా ఎన్నుకోవటం అభినందనీయమన్నారు. గతంలో టిటిడి సభ్యునిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారన్నారు. ఇరు జిల్లాలోని పలు ఆలయాల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. 4.65కోట్ల రూపాయలతో భద్రాచలంలో అదనపు గదుల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు గత ఎడాదే శంకుస్థాపన చేశారన్నారు. 350మంది నిరుపేదలకు శస్తచ్రికిత్సలు చేయించటంతో పాటు 40్భజన మందిరాలు మంజురు చేయించారన్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన అందుకు విధేయుడై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. గతంలో ఉభయ జిల్లాలోని దేవాలయాలకు టిటిడి తరుఫునా నిధులు మంజురు చేయించటంలో కీలకపాత్ర పోషించారన్నారు. అలాగే ఉభయ జిల్లాల నుండి 80వేల మందికి శ్రీవారి దర్శనానికి సీఫార్సు ఇచ్చిన ఘనత సండ్రకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మద్దివంచలో భారీ కొండచిలువను హతమార్చిన గ్రామస్థులు
గార్ల, ఏప్రిల్ 22: గేదెలను మింగేంతుకు వస్తున్న భారీ కొండచిలువను ఆదివారం గార్ల మండలం మద్దివంచ గ్రామంలో గ్రామస్థులు హతమార్చారు. గ్రామ పొలిమేరల్లో మేత మేస్తున్న గేదెలను మిగేందుకు వస్తున్న కొండచిలువను చూసిన గేదెలు అరుపులు అరుస్తు పరుగెడుతుండగా విషయం తెలుసుకున్న గేదెల కాపలాదార్లు సమాచారాన్ని గ్రామస్థులకు తెలపడంతో వారంతా వచ్చి కొండచిలువను హతమార్చారు. 15అడుగుల పొడవు భయంకరంగాఉన్న భారీ కొండచిలువను గతంలో ఎన్నడు చూడలేదని గ్రామస్థులు తెలిపారు.

ఘనంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి ఆవిర్భావ దినం
వైరా, ఏప్రిల్ 22: స్థానిక విక్రమ్ భవన్‌లో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం విక్రమ్‌భవన్‌లో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్లూరు డివిజన్ కార్యదర్శి కంకణాల అర్జున్‌రావు మాట్లాడుతూ 49సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన విప్లవపార్టీ ఈనాటికి ప్రజల కోసమే పనిచేస్తున్నదని అన్నారు. దేశంలో పేదలు, దళితులు, మైనార్టీల ఆర్థిక, రాజకీయ, సాంఘీక, విద్య పరంగా అభివృద్ధినే కోరుకునే పార్టీగా ప్రజల మన్ననలను పొందుతున్న పార్టీగా ఎదిగిందని అన్నారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో మోడీ, కెసిఆర్ నేతృత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు కొనుగోలుకు అనేక రకాల పన్నులతో డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. దేశంలో ఆడపిల్లలు, మైనార్టీలు, దళితులపై జరగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టవలసిన అవసరం ఉందని అన్నారు. భారతదేశం లౌకికదేశం ఈవిషయాన్ని బిజెపి పెద్దలు మరిచి మతోన్మాద శక్తులకు తావిస్తున్నాయని ఆరోపించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు బిజెపి అనుకూలమా లేక ప్రతికూలమా వారికే తెలుసన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు కుదురుపాక దర్గయ్య, యలదండి బాబు, లాల్‌మియా, సహదేవా, రంజాన్, చంద్రబోస్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.