ఖమ్మం

అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 22: అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్ర్తి శిశు సంక్షేమ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 49,50డివిజన్లలో 50లక్షల రూపాయల సిసి రోడ్లుకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం దానవాయిగూడెం, రామన్నపేట పరిధిలోని పేద ప్రజలకు ఇండ్ల పట్టాలివ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కల్యాణలక్ష్మి పేరుతో 1,00,116రూపాయలతో ఆడపిల్ల పెళ్ళి ఖర్చులకు అందించడం జరుగుతుందన్నారు. రైతు పెట్టుబడులకు ఎకరాకు నాలుగు వేలు చొప్పున అందించి రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏ ప్రభుత్వం చేయని కృషి మన ముఖ్యమంత్రి చేయడం అభినందనీయమన్నారు. రైతును రాజు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమన్నారు. పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డు వల్ల రామన్నపేట, దానవాయిగూడెం కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తెలిసిన వెంటనే మంత్రి అధికారులను నగరానికి దూరంగా డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్థి సంస్థ చైర్మన్ బుడాన్ బేగ్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ పాపాలాల్, ఆత్మ కమిటీ చైర్మన్ ఎం యల్లారెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు నల్లమల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సందీప్‌కుమార్‌ఝా, ఆర్డీఓ పూర్ణచంద్, జడ్పీ సిఇఓ మారుపాక నగేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్థలాలు కొనుగోలు చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తాం
* మంత్రి తుమ్మల
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22: రైతులు భూములు వియ్రించేందుకు ముందుకు వస్తే..వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని పోలేపల్లి గ్రామంలో 7.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన 18 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలో లబ్దిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు. మరో 56 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ అక్కినపల్లి వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దాతలు ముందుకు వస్తే తీర్థాల సంగమేశ్వరాలయాన్ని అనుకున్న దానికంటే గొప్పగా నిర్మించుకోవచ్చన్నారు. ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేయనున్నట్టు మంత్రి చెప్పారు. మండలంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఆర్డీవోతో చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి తహశీల్దార్ నరసింహారావును ఆదేశించారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోలేపల్లిని ఖమ్మం కార్పోరేషన్‌లో కలిపామని మంత్రి వివరించారు. సంబంధిత జీవో రాగానే వెంటనే రోడ్లు వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో తాగు, సాగు, గృహ సంబంధ అంశాలలో ముందడుగులో ఉందన్నారు. గత పాలకులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి వాటికి సంబంధించిన బిల్లులు లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పెండింగ్ బిల్లులన్నీ ఇప్పించినట్టు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో మొదటి విడతగా 50 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ఇవి పూర్తవగానే మరికొన్ని కమ్యూనిటీ హాళ్ళను మంజూరు చేయిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు, ఇప్పటికే పూర్తయిన భక్తరామదాసు ప్రాజెక్టుల ద్వారా జీవ వనరులైన కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోగలిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. భక్తరామదాసు పథకం ద్వారా విడుదల చేసిన నీటితో పాలేరు నియోజకవర్గంలోని చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నారు. సాగు, తాగునీటికి కొదువేలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ముందుచూపుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేరువ చేసిందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి, మీవెంటనే ఉన్నామని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు భరోసా ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో ఐడిసి చైర్మన్ బేగ్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మేయర్ డాక్టర్ పాపాలాల్, ఆత్మ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సభ్యులు నల్లమల వెంకటేశ్వరరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండి వౌలానా, ఆర్డీవో పూర్ణచందర్‌రావు, సిఇఓ మారపాక నగేష్, జెడ్పీటిసి భారతి, ఎంపిపి లలిత, కార్పోరేటర్ ధరావత్ రామ్మూర్తినాయక్, బెల్లం వేణు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు బండి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.