ఖమ్మం

జిల్లా కలెక్టర్, ఎస్పీ బదిలీకి సిఇసి ఉత్తర్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 26: ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ, పాలేరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వలుజారీ చేసింది. పాలేరు ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, ఎస్పీ షాన్‌వాజ్ ఖాసీం, ఎన్నికల రిటర్నింగ్ అధికారి గణేష్‌లు పని చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రేణుకాచౌదరి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ నేతృత్వంలో ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పారదర్శకంగా పాలన సాగించాలని, ఎన్నికల్లో అధికారాన్ని దుర్వినియోగం చేయరాదంటూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తక్షణమే కొత్త అధికారులను నియమించేందుకు పేర్లను పంపించాలని సిఈసి ప్రభుత్వాన్ని ఆదేశించింది.