ఖమ్మం

పోలీస్ సంక్షేమానికి కృషిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఏప్రిల్ 24: శాఖాపరంగా పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి విధి నిర్వహణలో వారికి ఎలాంటి అటంకం రాకుండా పోలీస్ సంక్షేమానికి కృషి చేస్తానని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ హామీ ఇచ్చారు. స్థానిక కమీషనరేట్‌లో ఆర్ముడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి మంగళవారం నిర్వహించిన పోలీస్ దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ మరింత క్రమశిక్షణతో పోలీస్ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇంక్రిమెంట్లు, పదోన్నతలు, ఇంటి అద్దె సదుపాయం సంబంధిత వ్యవహారాలలో పెండింగ్ పైళ్ళను తక్షణమే పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. మహిళా పోలీసుల కోసం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రత్యేక వసతి, టాయ్‌లెట్ల నిర్మాణాలను చేపడతామన్నారు. ఆర్ముడ్ ఆయుద కర్మాగారం సిబ్బందికి టెక్నికల్ అలవెన్స్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సిబ్బంది నివాసం ఉంటున్న క్వార్టర్ల మరమ్మతులను చేపడతామన్నారు. వచ్యే బడ్జెట్ ఆధారంగా ట్రావెలింగ్ అలవెన్స్ పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. క్వార్టర్‌లలోని డిపార్టమెంట్ ఆసుపత్రిలో వైద్యులను నియమిస్తామన్నారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి కొల్లు సురేష్‌కుమార్, ఏసిపి పివి గణేష్, ఎఆర్ ఎసిపిలు వెంకటేశ్వర్లు, విజయబాబు, ఆరై శ్రీనివాస్, మధన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.