ఖమ్మం

ఆన్‌లైన్ విధానంలో ఇసుక పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 24: ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుకను పంపిణీ చేసేందుకు ఇసుక పన్ను విదానానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో మంగళవారం ఇసుక పన్ను విధానం అమల పరిచేందుకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీ చేసేందుకు భూగర్భజలం, మైనింగ్ శాఖల సమన్వయంతో నివేధిక అందజేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు తమ వాహనాలను తప్పనిసరిగా రిజిష్టర్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆకేరు, కట్టలేరు, మునే్నరు, వైరా నదుల ద్వారా ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, బోనకల్లు, తిరుమలాయపాలెం మండలాల్లో ఉన్న ఇసుక నిల్వల వనరుల ఆధారంగా ఇసుక పన్ను విధానాన్ని అమలుచేసేందుకు సాద్యాసాద్యాలను గుర్తించి నివేధికలు అందించాలని అధికారులను ఆదేశించారు. పోలంపల్లి ముంపు ప్రాజెక్ట్ బాగంలోని ఇసుకను తీయడానికి ఖనిజాభివృద్ధి సంస్థకు ఇచ్చేందుకు ఇసుక కమిటి ఆమోదం తెలిపిందన్నారు. స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక వాహనాలను సీజ్‌చేసి బాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్‌శాఖ ఏడి నరసింహారెడ్డి, డిపివో శ్రీనివాసరెడ్డి, డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ఇందుమతి, కలెక్టరేట్ ఏవో మదన్‌గోపాల్, పలు శాఖల అధికారులు, తాహశీల్దారులు పాల్గొన్నారు.