ఖమ్మం

నేడు నిరసన దినంగా పాటించాలని మావోల పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, ఏప్రిల్ 24: చర్ల మండల పరిధిలోని అంజనాపురం, చిన్నమిడిసిలేరు గ్రామాల్లో మావోయిస్టులు లేఖలు వదిలారు. ఈ లేఖల్లో ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈనెల 25న నిరసన దినంగా పాటించాలని, దళిత, ఆదివాసీలపై హిందూ బ్రాహ్మణ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో మావోలు పేర్కొన్నారు. దళిత, ఆదివాసీల రక్షణ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే సుప్రీంకోర్టు సవరణ తీర్పును ప్రజానీకం ఐక్యంగా వ్యతిరేకించాలని, ఆర్‌ఎస్‌ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో ఉంది. యూనివర్సిటీలు, కళాశాలల్లో యువతులపై లైంగిక ఆత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలని, నూతన ప్రజాస్వామిక విప్లవం వర్థిల్లాలి అంటూ చర్ల శబరి ఏరియా కమిటీ పేరిట మావోయిస్టులు లేఖలను వదిలారు.

నేటి నుండి ఖమ్మంలో పివైఎల్ రాష్ట్ర మహాసభలు
ఖమ్మం(కల్చరల్), ఏప్రిల్ 24: ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్), రాష్ట్ర 7వ మహాసభలు నేటి నుండి ఉద్యమాల ఖిల్లా ఖమ్మం నడిబొడ్డున నిర్వహిస్తున్నామని, వీటిని యువత, మేధావులు, ప్రజాతంత్రవాదులు, ప్రజలు అధికసంఖ్యలో జయప్రదం చేయాలని పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సివై పుల్లయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక రామనర్సయ్యవిజ్ఞానకేంద్రంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీశామన్నారు. 1980 దశకంలో పివైఎల్ యువజన ఉద్యమాలు నిర్మించడానికి జనించిందన్నారు. 3 దశాబ్ధాల చరిత్ర కలిగిన పివైఎల్ రాష్ట్ర 7వ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలో 25న స్ధానిక ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన వైరారోడ్ మీదుగా పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుంటుందన్నారు. ఈ ప్రదర్శనలో అరుణుదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారుల ప్రదర్శనలు, మహిళల కోలాటం, చిన్నారుల కోలాటం, విచిత్ర వేశధారణలు ఆటపాటలతో అలరింపజేస్తారన్నారు. వెయ్యి మంది రెడ్‌షర్టు వాలంటీర్లు ప్రదర్శనలో అగ్రభాగాన నిలవనున్నారని తెలిపారు. యువజన డిమాండ్లు ప్రతిబింభించే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు, బిగిపిడికిలి జెండాలను చేతబూని ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్‌లో వేలాదిమందితో బహిరంగ సభ ఉంటుందన్నారు. దీనికి ప్రధాన వక్తగా జెఎన్‌యు విద్యార్ధి బాసో సంఘం నేత ఉమర్ ఖలిద్, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయకార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావులు ప్రసంగిస్తారని తెలిపారు. 26న స్ధానిక రాజ్‌పధ్ ఫంక్షన్‌హాల్‌లో ప్రతినిధుల సభ ప్రారంభవౌతుందన్నారు. విలేఖరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి సక్రు, అశోక్, కె ఎస్ ప్రదీప్, జె భరత్, ఎం జగన్, టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

డీఈడీలో ప్రతిభ విద్యార్థుల ప్రభంజనం
కల్లూరు, ఏప్రిల్ 24: ఫిబ్రవరిలో జరిగిన డీఈడీ ద్వితీయ సంవత్సర పరీక్షా పలితాల్లో స్థానిక శ్రీ లక్కినేని రామయ్య ప్రతిభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివనాగరాజు తెలిపారు. తమ కళాశాలలో మొత్తం 41మంది విద్యార్థులకు గాను 41మంది డిస్ట్రిక్షన్‌లో ఉత్తీర్ణత సాధించారన్నారు. వీరిలో ఎం రమాదేవి 96.5శాతం, యు సంగీత 95.7శాతం, ఆర్ ఉదయ్‌కిరణ్, జి అఖిల 95.5శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరక్టర్ లక్కినేని ప్రసాద్ ప్రిన్సిపాల్, అధ్యపక బృందాన్ని, విద్యార్థులను అభినందించారు.