ఖమ్మం

ప్లీనరీకి జిల్లా నుండి వెయ్యి మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 24: ఈ నెల 27వ తేదిన హైదరాబాద్‌లో జరిగే టిఆర్‌ఎస్ ప్లీనరీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, కార్యదర్శి తాతా మధులు తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ప్లీనరీలలో బంగారు తెలంగాణ సాధించటం ఎలా అనే అంశంపైనే చర్చలు జరిగేవి అన్నారు. అందులో భాగంగానే అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు కల్పించటంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విజయవంతం అయ్యిందన్నారు. అందరికి మంచినీరు, రోడ్లు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు అనేక పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ఈ సారి ప్లినరిలో మాత్రం ఇప్పటి వరకు సాదించిన విజయాలు, ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు చేయాల్సిన పనులు, సాధారణ, స్థానిక ఎన్నికలకు సన్నద్దత తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ఉందన్నారు. ఎన్నికల వరకు మరో ప్లినరి జరిగే అవకాశం లేదని, అక్టోబర్, నవంబర్ నెలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ ప్లినరికి జడ్పిటిసిలు, ఎంపిపిలు, కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిలు మాత్రమే హజరవుతారన్నారు. వీరందరికి 26వ తేదిన సాయంత్రమే పాస్‌లు అందజేస్తామన్నారు. 3నియోజకవర్గాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడే 27వ తేది ఉదయం 7గంటల నుండి పాస్‌లు పొందిన వారు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన ఎజెండాగా సాగే ఈ ప్లినరిని విజయవంతం చేయాలన్నారు. మరో వైపు ఫెడరల్ ఫ్రంట్‌పై కూడా కెసిఆర్ స్పష్టమైన ప్రకటన చేస్తారని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మినారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, బేగ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి ఏడు ఎద్దులు మృతి
చర్ల, ఏప్రిల్ 24: చర్ల మండలంలోని పెద్దిపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో కలివేరు గ్రామంలో విద్యుత్‌షాక్‌కు గురై 7 ఎద్దులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో రూ.5లక్షల విలువజేసే ఎద్దులు మృతి చెందడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి చర్ల మండలంలో సంభవించిన గాలిదుమారానికి కలివేరు గ్రామ శివారులో 11 కేవీ విద్యుత్ లైన్లు నేలకొరిగాయి. మంగళవారం ఉదయం మేతకు వెళ్లిన పశువులు కిందపడిన విద్యుత్ లైన్లు తగలడంతో 7 పశువులు అక్కడికక్కడే మృతిచెందాయి. విషయం తెలుసుకున్న పశువుల కాపరి గ్రామంలో సమాచారమిచ్చాడు. గ్రామస్తులు విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలివేరు వీఆర్‌ఓ పంచనామా నిర్వహించారు. మృతి చెందిన పశువులు గిరిజన రైతులకు చెందినవి. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ దుక్కిటెద్దులు మృతి చెందాయని, తమకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. మరో నెలలో వ్యవసాయ పనులు ముమ్మరం కానున్నాయి. ఈ సమయంలో పశువుల మృతితో వ్యవసాయం భారంగా మారుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు తమకు వ్యవసాయానికి లభించే దుక్కిటెద్దులు లభించడం కష్టమని రైతులు వాపోతున్నారు. మృతి చెందిన పశువులకు పశువైద్య అధికారులు సూచించిన మేరకు నష్టపరిహారం చెల్లించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.