ఖమ్మం

రాజీవ్‌గాంధీ వర్థంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, మే 21: కల్లూరులో సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రజలు జీవన ప్రమాణాలు పెంచటానికి పాటు పడ్డారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాజీవుని జీవితం దేశానికి అంకితమైందన్నారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకై ప్రతి కార్యకర్త పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండలాధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాదు, సీనియర్ నాయకులు నంగునూరి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు జిల్లెళ్ల కృష్ణారెడ్డి, భూక్యా శివకుమార్ నాయక్, జనార్థన్, టి లాలయ్య, ఎస్‌కె రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల మార్పిడి కోసం బారులు తీరిన రైతులు
జూలూరుపాడు, మే 21: ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి సాయం కోసం అందజేసిన చెక్కులను మార్చుకునేందుకు స్థానిక బ్యాంకు వద్ద రైతులు సోమవారం బారులు తీరారు. బ్యాంకు వద్ద చెక్కులు మార్చుకునేందుకు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రతిరోజు అధిక సంఖ్యలో బ్యాంకు వద్దకు ఉదయానే్న చేరుకుని క్యూ కడుతున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా బ్యాంకు వద్దకు చేరుకోవటం, ఎండలు మండుతుండటంతో చెక్కులను మార్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ముందు అధికారులు టెంట్‌లతోపాటు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రం నుంచి పాపకొల్లు వెళ్లే రోడ్డు పక్కనే బ్యాంకు ఉండటంతోపాటు అదే మార్గంలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, సొసైటీ, పశువైద్యశాలలు ఉండటంతో రహదారి రద్దీగా ఉంటుంది. బ్యాంకు ముందు రోడ్డు వరకు రైతులు బారులు తీరుతుండటంతో పోలీసులు వాహనాల రాకపోకలను మళ్లించటంతోపాటు, బ్యాంకు వద్ద రైతులకు సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.