ఖమ్మం

పంచాయతీల విభజనలో రాజకీయ జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మే 21: గ్రామ పంచాయతీల విభజనలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ జోక్యం ఉన్నట్లు స్పష్టమవుతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక వెంకటేశ్వర హోటల్ మీటింగ్ హాల్‌లో సోమవారం పట్టణ కార్యదర్శి తమ్మళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కూనంనేని మాట్లాడారు. పంచాయతీల విభజన అడ్డగోలు పద్ధతిలో జరిగిందని, ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న పంచాయతీలను వేరు చేసి దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆళ్ళపల్లి పరిధిలో దొంగతోగు, అడవి రామవరం, పాత పాండురంగాపురం పంచాయతీలను వంద ఓట్లలోపు పంచాయతీలుగా విభజించారని, అధికారులు, అధికార పార్టీ పెద్దలు శాస్ర్తియత లేకుండా కుమ్మక్కై విభజన చేశారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీపీఐని ప్రజల నుంచి దూరం చేయలేరని, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి సీపీఐ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కె.సారయ్య, బ్రహ్మం, రవికుమార్, కల్లూరి వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మి, శ్రీనివాసరెడ్డి, కమటం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
ఖమ్మం(కల్చరల్), మే 21: ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై పెట్టిన అక్రమకేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్షనేతలు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమకేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సోషల్‌మీడియా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మంచికంటి భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. వై విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా, విద్యార్ధి, యువజన సంఘాలతో పాటు వ్యాపార వర్గాల బాధ్యులు పాల్గొని మాట్లాడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో కుతంత్రాలు చెల్లవన్నారు. ఇది ప్రజాస్వామ్యదేశమని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడం దారుణమన్నారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ను తరలించాలని విశ్వప్రయత్నం చేసి అక్కడి ప్రజలకు దూరమైనారన్నారు. మార్కెట్ తరలింపును అడ్డుకోవడంలో అలుపెరగని పోరాటాన్ని చూసి తట్టుకోలేక ఆనాడు సిపిఎం నేతలపై కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీస్తూ కరపత్రాన్ని వేసిన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్, ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం దారుణమన్నారు. అక్రమ కేసులపై నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోలీస్‌కమీషనర్‌ను కలిసి లిఖితపూర్వకమైన ఫిర్యాదుచేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సోషల్‌మీడియా రాష్ట్ర కన్వీనర్ జి జగదీష్, ఫెమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, ఎంఎల్ నేత ఆవుల అశోక్, టి జెఎసి కన్వీనర్ డాక్టర్ పాపారావు, ప్రముఖ విద్యావేత్త రవిమారుతి, కాంగ్రెస్ నేతలు బాబా, వడ్డెబోయిన నర్సింహారావు, బాలగంగాధర్‌తిలక్, నాగండ్ల దీపక్‌చౌదరి, ఎంఎల్ జిల్లా కార్యాదర్శి కోలేటి నాగేశ్వరరావు, బీసి సంఘ నేతలు మెరుగు వెంకటరమణ, శ్రీనివాస్, టి జెఎసి నేత భద్రూనాయక్, ముస్లీం హక్కుల పోరాట నేత అసద్, టిమాస్ జిల్లా కన్వీనర్ యర్రా శ్రీకాంత్, ఎంఆర్‌పిఎస్ జిల్లా నాయకులు అంబేద్కర్, అంబేద్కర్ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు గుంతేటి వీరభద్రం, ప్రముఖ నాయవాది సుగుణారావు తదితరులు ప్రసంగించారు.