ఖమ్మం

టీఆర్‌ఎస్ శక్తులు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), మే 21: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకొని గద్దె దింపడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరావు, జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హరితా గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో వారు మాట్లాడుతూ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ తరువాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికే పలు మార్పులు వచ్చాయని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుతో మరన్ని మార్పులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహానాడులో జిల్లా, రాష్ట్ర సమస్యలపై చర్చించడంతో పాటు నూతన కమిటీలను నియమించనున్నట్లు వెళ్లడించారు. ఈ నూతన కమిటీల ద్వారా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు టిఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ కుల వ్యతిరేక విధానాలతో కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. టిడిపి పార్టీలో నూతన వారిని తీసుకొచ్చేందుకు, పార్టీ బలోపేతానికి నాయకులు ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. దీంతో పాటు త్వరలో రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా తమ శక్తిని నిరూపించుకునేందుకు, టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ కుటుంబపాలన కొనసాగిస్తోందని కనీసం ప్రజా ప్రతినిధులను సైతం గౌరవించలేని స్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో 90శాతం బడుగు, బలహీన వర్గాల వారు ఉన్నారని టిఆర్‌ఎస్ చెబుతున్నప్పటికి వారికి ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ, డబుల్‌బెడ్రూం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరద వంటి పథకాలలో భారీ కుంభకోణాలు జరిగాయని వాటిని ప్రజలు మరిచేందుకు, రానున్న ఎన్నికల కోసం రైతుబంధు అనే పథకంతో ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే రైతుబంధు వల్ల ఉపయోగంలేదని, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి నిజమైన ప్రేమను నిరూపించుకోవాలన్నారు. ప్రపంచంలోనే ఆదర్శ పథకంగా చెప్పుకుంటున్న రైతుబంధు వల్ల రైతులకు ఉపయోగం లేకపోగా ప్రభుత్వం పంచే పంట సాయం భడా భూస్వాములకు తప్ప కౌలు రైతులకు, పోడు సాగు చేసే గిరిజన రైతులకు ఉపయోగం లేని పథకంగా ప్రజలు బావిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పంచే ఈ నగదు అత్యంత దుర్వినియోగం అవుతుందని అది ప్రజలసొమ్యేకానీ టిఆర్‌ఎస్ పార్టీ ఫండ్ కాదని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ చర్యల ద్వారా లాభాల్లో ఉన్న రాష్ట్రం కాస్తా లక్షల కోట్ల బకాయిల్లో పడిపోయిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెబుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు రామనాధం, గంగాధర్, సంజీవరెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, కృష్ణమోహన్, హరికృష్ణ, మాధవరావు, గంగాధర్‌చౌదరి, జెడ్పీటీసి శ్యామల, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.