ఖమ్మం

మండలాలకు పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, మే 22: ప్రభుత్వ బడుల్లో ఉచితంగా విద్యార్థులకు సరఫరా చేసేందుకు గాను మండలాలకు పాఠ్య పుస్తకాలను పంపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు కొరత లేకుండ పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం పంపించింది. దీనిలో భాగంగా నేలకొండపల్లి గ్రామంలోని ఎమ్మార్సీ భవనంకు పాఠ్యపుస్తకాలను స్థానిక విద్యాశాఖాధికారి పురుషోత్తరావు ఆధ్వర్యంలో చేరాయి. దీనిలో భాగంగా నేలకొండపల్లి మండలానికి దాదాపు 22400 పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు విద్యాశాధికారి తెలిపారు. 2018-19 సంవత్సరానికి దాదాపు 28400 పుస్తకాలకు గాను మొదటి విడతగా 22400 పుస్తకాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలను పకడ్బందీగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలకు ప్రత్యేక బారు కోడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కోడ్ వల్ల ఆయా పాఠ్యపుస్తకాలు ఏ విద్యార్ధికి ఇచ్చింది అనేది అన్‌లెన్ ద్వార ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు కొంత మంది గతంలో పక్కదారి లో మార్కెట్‌కు తరలించి డబ్బులు వసూలు చేసుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం కోడ్ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఎటువంటి అక్రమాలకు ఎలాంటి తావుఉండవని ఆయన తెలిపారు. ఈ బార్‌కోడ్ ఉన్న పుస్తకాలు మార్కెట్‌లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అనంతరం మండలంలో వివిధ పాఠశాలకు ఆటోల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపించారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌పిలు ప్రసాద్, రాధా, సేహునాద్, మీరా, వెంకటేశ్వర్లు, పుష్పా, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ భవనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్
* కార్మిక వేతనాలు పెంపు * పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం(ఖిల్లా), మే 22: కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ అని, వారి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం రోటరీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్యాలయాలతో పోల్చుకుంటే ఖమ్మం మున్సిపల్ కార్మికులు ఎంతో అదృష్టవంతులన్నారు. కార్మికుల కష్టాలు ఎరిగిన సిఎం 8వేల రూపాయల వేతనం నుండి 14160రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులే కీలకమన్నారు. గత సంవత్సరం జరిగిన మున్సిపల్ సమావేశంలో స్వయంగా తానే కార్మికుల వేతనాలు పెంచాలని తీర్మానించినట్లు, అందుకు టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాల సమస్యను అధిగమించామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణను చేసుకోవాలనే ఆకాంక్షతో అంగన్‌వాడీ, హోంగార్డు, ఆశావర్కర్ల జీతాలు పెంచారన్నారు. బంగారు తెలంగాణ అభివృద్థిని చూడలేని కొన్ని పార్టీలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు పోరాటాలకే పరిమితమని, నిర్ణయాలు చేయలేరని స్పష్టం చేశారు. కార్పొరేషన్ బాగుండాలంటే సమిష్టిగా పోరాటాలు చేయాలే తప్ప మోకాలొడ్డాలనుకోవడం సమంజసం కాదన్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1నుండి అమలు చేస్తామని, ఆయా జీతాలు మొదటి వారంలోనే అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ రూపొందించామన్నారు. ఖమ్మంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో రానున్న రోజుల్లో ఖమ్మం మున్సిపల్ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన వైద్యం కోసం మమతా ఆసుపత్రి ద్వారా ప్రభుత్వం నుండి ఎంప్యానెల్‌మెంట్ చేయించి ఉచిత వైద్యం చేయిస్తామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పగడాల నాగరాజు, మందడపు మనోహర్, నాగండ్ల కోటి, కమర్తపు మురళీ, కొత్తపల్లి నీరజ, కుమ్మరి ఇంధిరా, రమాదేవి, షౌకత్‌అలీ, పాపారావు, కార్మిక నాయకులు బుర్రి వినయ్‌కుమార్, తోటా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.