ఖమ్మం

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఐఎఫ్‌టియు నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మే 25: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, వాటిన జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారత కార్మికసంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టియు) ఖమ్మం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో స్ధానిక బైపాస్‌రోడ్‌లోని ఎన్‌టిఆర్ సర్కిల్ నుండి ఇల్లందు క్రాస్‌రోడ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఎ రామారావు, సిహెచ్ విప్లవకుమార్‌లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోని మోదీ ప్రభుత్వం 4 ఏళ్ళ పాలనలో 121 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించారు. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ వంటి సంస్కరణలతో ప్రజలు, కార్మికులు సరైన పనులు దొరకక ఇబ్బందులు పడుతుంటే రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మోయలేని భారంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే జిస్టీ పరిధిలోకి తేవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు ఏరియా కమిటీ నాయకులు ఎం లక్ష్మినారాయణ, జయరాజు, ప్రసాద్, రామరాజు, శ్రీను, రమణ, నాగేశ్వరరావు, ప్రకాశం, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టు కృష్ణయ్య (కిట్టు) మృతి
చింతకాని, మే 25: స్థానిక పాత్రికేయుడు పసుపులేటి కృష్ణయ్య (40) గుండెపోటుతో శుక్రవారం నాగులవంచలో మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి...నాగులవంచలో సొసైటీలో ఏర్పాటుచేసిన మొక్కజొన్నలకొనుగొలు కేంద్రాన్ని పరిశీలించేందుకు రైతుసమన్వయ సమితి జిల్లాసమన్వయకర్త నల్లమల వేంకటేశ్వరరావుతో కలసి విధినిర్వహణలో భాగంగా కృష్ణయ్య నాగులవంచ వెళ్ళారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నాడు. అనంతరం అరోగ్యంలో కొంత తేడా కన్పిస్తుందంటూ నాగులవంచలో తనకు మిత్రుడైన అర్‌ఎంపి వద్దకు వెళ్ళి బిపి పరిశీలించుకొని మాత్రవేసుకొని, రికవరి అయ్యి తిరిగి బయలుదేరే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి కృష్ణయ్య(కిట్టు) అక్కడికక్కడే మృతిచెందాడు. అ సమయంలో టిఆర్‌ఎస్ నేతలు పెంట్యాల పుల్లయ్య, కిలారు మనోహర్‌బాబు, వంకాయలపాటి సత్యనారాయణలతో పాటు మండల కాంగ్రెసు అధ్యక్షులు అంబటి వేంకటేశ్వరావు, పాత్రికేయుడు చావా అరుణ్‌కూమార్‌లు అక్కడే ఉన్నారు. తమ కళ్ళముందే పాత్రికేయుడు కిట్టు మృతిచెందటం వారిని కలచి వేసింది. మృతదేహాన్ని నాగులవంచ నుండి కిట్టు స్వగ్రామమైన రామకృష్ణాపురం తరలించారు. మృతదేహాంపై నిండుగర్భిణి అయిన భార్యతో పాటు మూడేళ్ళ చిన్నారి రోదిస్తున్న తీరు పలువుర్ని కన్నీటి పర్యంతం చేసింది. పాత్రికేయుడు కిట్టు మరణ వార్త తెలుసుకున్న జిల్లా జర్నలిస్టుల సంఘనేతలు రామకిష్ణాపురం వెళ్ళి భౌతికకాయంపై పుష్ఫగుచ్ఛాలు నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చి తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.